LPG Cylinder Price hike : వినియోగదారులకు షాక్! మళ్లీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర..
Cylinder Price hike : వినియోగదారులకు షాక్! కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మరోమారు పెంచాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ .16.50 పెంచుతున్నట్టు ఆదివారం వెల్లడించాయి. తాజా పెంపుతో ఇప్పుడు దిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .1,818.50కు చేరుకుంది.
అయితే వంటింట్లో, నిత్యం వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను ఓఎంసీలు పెంచలేదు. ఇది సామాన్యుడికి కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ, రెస్టారెంట్లు వంటి ప్రాంతాల్లో వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచడం.. కస్టమర్లను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి. సిలిండర్ ధరలు పెరిగితే రెస్టారెంట్లు మెన్యూలో ధరలు పెంచొచ్చు!
మరోవైపు 5కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా రూ .4 పెరిగింది.
పెంచిన అన్ని ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.16.5 పెరిగడంతో, హైదరాబాద్లో నిన్నటి వరకు రూ.2028గా ఉన్న సిలిండర్ రేటు ఇప్పుడు రూ.2044.5గా మారింది.
తాజా పెంపు అనంతరం ముంబై, కోల్కతా, చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా.. రూ. 1771, రూ. 1928, రూ 1981కి చేరాయి.
ధరల పెరుగుదల ధోరణి..
గత నెలలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.62 పెరిగాయి.
ఈ ధరల సర్దుబాట్లు తమ కార్యకలాపాల కోసం ఎల్పీజీపై ఎక్కువగా ఆధారపడే వాణిజ్య సంస్థలు, చిన్న వ్యాపారాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల బట్టి ప్రతి నెల సిలిండర్ ధరలను ఓఎంసీలు సవరిస్తుంటాయి. ఒక్కోసారి ధరలను పెంచుతాయి, ఇంకోసారి తగ్గిస్తాయి. లేదా యాథతథంగా వదిలేస్తాయి.
అయితే ఇటీవలి కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 2024లో చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ .48.50 పెంచాయి. ఇక నవంబర్లో మరో రూ. 62 పెంచారు. సెప్టెంబర్లో సైతం రేట్లు పెరిగాయి.
సంబంధిత కథనం