రూ. 7లక్షల బడ్జెట్​లో కారు కొనాలా? టాటా ఆల్ట్రోజ్​ బేస్​ వేరియంట్​ బెస్ట్​ ఛాయిస్​!-looking to buy the 2025 tata altroz heres what the smart variant offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ. 7లక్షల బడ్జెట్​లో కారు కొనాలా? టాటా ఆల్ట్రోజ్​ బేస్​ వేరియంట్​ బెస్ట్​ ఛాయిస్​!

రూ. 7లక్షల బడ్జెట్​లో కారు కొనాలా? టాటా ఆల్ట్రోజ్​ బేస్​ వేరియంట్​ బెస్ట్​ ఛాయిస్​!

Sharath Chitturi HT Telugu

2025 టాటా ఆల్ట్రోజ్​ ఇటీవలే మార్కెట్​లోకి వచ్చింది. ఈ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లోని బేస్​ వేరియంట్​లో ఎలాంటి ఫీచర్స్​ ఉన్నాయి? దీని కొనుగోలు చేయొచ్చా? పూర్తి వివరాలు..

2025 టాటా ఆల్ట్రోజ్​..

రూ. 7లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టిన టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. టాటా ఆల్ట్రోజ్​ స్మార్ట్​ (బేస్​ వేరియంట్​)లో బడ్జెట్​ తగ్గ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​..

2025 టాటా ఆల్ట్రోజ్ ప్రధాన కాస్మెటిక్ మార్పులు, ఫీచర్​ అప్​గ్రేడ్స్​తో ఇటీవలే లాంచ్ అయింది. టాటా మోటార్స్​కి చెందిన ఇతర కార్లు నెక్సాన్​ ,కర్వ్​, హారియర్​ల ఉన్నట్టుగానే ఆల్ట్రోజ్​లో కూడా ఒక పర్సోనా ఉంటుంది.

2025 టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.89లక్షలు- రూ. 11.49 లక్షల మధ్యలో ఉంటుంది. ఐదు ట్రిమ్స్​లో ఇది అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్​, ప్యూర్​, అకంప్లీష్​డ్​ ఎస్​, అంకప్లీష్​డ్​+ ఎస్​. స్మార్ట్​ అనేది బేస్​ వేరియంట్​.

2025 టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్: డిజైన్- ఫీచర్లు..

2025 టాటా ఆల్ట్రోజ్ లైనప్ స్మార్ట్​తో ప్రారంభమవుతుంది. ఇందులో బేస్ లెవల్ సేఫ్టీ, బేసిక్ డిజైన్ ఫీచర్లు ఉంటాయి. ఈ మోడల్ పూర్తి భద్రతా ప్యాకేజీ, ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్​పీతో వస్తుంది. ఇది డ్రైవర్​, ప్యాసింజర్​ సేఫ్టీకి నమ్మకాన్ని ఇస్తుంది.

ఎక్స్​టీరియర్ హైలైట్లలో ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్లీక్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఎంట్రీ- ఎగ్జిట్​ కోసం 90 డిగ్రీల తెరుచుకునే తలుపులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వేరియంట్​లో టాటా లోగోతో కూడిన స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, లోపల ప్రత్యేకమైన 3డీ ఫ్రెంట్ గ్రిల్ ఉన్నాయి.

2025 టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్: ఇంజిన్..

2025 టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​.. ప్రీ ఫేస్​లిఫ్ట్ మోడల్ మాదిరిగానే మూడు ఇంజిన్ ఆప్షన్స్​తో అందుబాటులోకి వచ్చింది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషనన్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ (ఏఎంటీ) లేదా 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్​మిషన్ (డీసీఏ) తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్లు 87బిహెచ్​పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

ఈ ఇంజిన్​కి సీఎన్జీ ఆప్షన్​ కూడా లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ని మాత్రమే పొందుతాయి. 72 బిహెచ్​పీ పవర్​, 103 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తాయి.

టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 89బీహెచ్​పీ పవర్, 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే, 2025 ఆల్ట్రోజ్ స్మార్ట్ వేరియంట్ పెట్రోల్- సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్స్​ని మాత్రమే పొందుతుంది. సీఎన్జీ ట్రిమ్ స్థాయితో సంబంధం లేకుండా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషషన్​ని మాత్రమే పొందుతుంది. స్మార్ట్ వేరియంట్ కోసం పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో మాత్రమే లభిస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం