Loan insurance : లోన్ ఇన్సూరెన్స్ తీసుకుని నష్టపోతున్నామా? అసలు నిజాలు తెలుసుకోండి..
Loan insurance : లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నిజంగానే మనకి మంచిదా? లేక ప్రీమియంలు కట్టి డబ్బులు నష్టపోతున్నామా? అసలేంటి ఈ లోన్ ఇన్సూరెన్స్? ఇక్కడ తెలుసుకోండి..
ఒక పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు దాని వడ్డీ రేటుతో పాటు ఛార్జీలు వంటి ఇతర విషయాలను కూడా పరిగణించాలి. ఇవి మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో పర్సనల్ లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్‌ని కూడా జోడిస్తున్నారు. ఫలితంగా మన మీద ఖర్చులు పెరుగుతున్నాయి. మరి.. ఈ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదేనా? లేక మనం నష్టపోతున్నామా? ఇక్కడ తెలుసుకోండి..
లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు, రుణదాతలు రుణ బీమాను ఎంచుకోవాలని రుణగ్రహీతలను కోరుతున్నారు. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనా.. తాము ఇచ్చిన రుణంపై ప్రభావం ఉండదనేది ఇందుకు కారణంగా చూస్తున్నారు.
నిరుద్యోగం, అంగవైకల్యం లేదా రుణగ్రహీత మరణం కారణంగా రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమయంలో లోన్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ లోన్ ఇన్సూరెన్స్ ఆప్షనల్ అయినప్పటికీ, తీసుకోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
లోన్ ఇన్సూరెన్స్‌తో వచ్చే ప్రయోజనాలేంటి?
1. ఏదైనా బీమా మాదిరిగానే, లోన్ ఇన్సూరెన్స్ అనేది రుణగ్రహీత తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైతే రుణం తిరిగి వస్తుందని రుణదాతకు బీమాదారు ఇచ్చిన హామీగా ఉంటుంది.
2. బీమా సంస్థ ఈ బీమా కోసం ప్రీమియం వసూలు చేస్తుంది. ఇది విడిగా కట్టడానికి ఉండదు. కానీ నెలవారీ వాయిదా లేదా లోన్ ఈఎంఐకి అటాచ్ అవుతుంది.
3. లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. ఇన్సూరెన్స్ ప్రీమియంల అదనపు భారాన్ని మోయడానికి ఇష్టపడని వారు దాన్ని తీసుకోకపోవచ్చు.
4. సాధారణంగా రుణదాతలు రుణగ్రహీతలను దీనిని ఎంచుకోవాలని కోరుతారు. కాబట్టి, రుణం నియమనిబంధనలను అంగీకరించే సమయంలో, రుణగ్రహీత తనకు ఇష్టం లేకపోతే రుణ బీమా ఎంపిక నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
5. కొందరు రుణదాతలు లోన్ ఇన్సూరెన్స్‌ని జీవిత బీమాగా అందిస్తున్నారు. ఇక్కడ డెత్ కవర్ అనేది మిగిలి పోయిన్ లోన్ అమౌంట్‌గా పరిగణించడం జరుగుతుంది. ఉదాహరణకు, ఎస్బీఐ లైఫ్ - రిన్ రక్ష అటువంటి ప్లాన్లలో ఒకటి. లోన్ ఇన్సూరెన్స్ అందించే మరో బీమా సంస్థ పీఎన్బీ మెట్‌లైఫ్ 'పీఎన్బీ మెట్‌లైఫ్ కంప్లీట్ లోన్ ప్రొటెక్షన్' పేరుతో ఆఫర్ చేస్తోంది.
రుణ బీమా ప్రభావం ఎంత?
1. రుణ బీమా సాధారణంగా వడ్డీ రేటును ప్రభావితం చేయదు. ఎందుకంటే క్రెడిట్ అర్హత, రుణ కాలపరిమితి, రుణదాత పాలసీలు వంటి అంశాలు రేటును నిర్ణయిస్తాయి.
2. రుణానికి బీమా ప్రీమియం జోడించడం వల్ల రుణ వ్యయం పెరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా రూ.5,00,000 రుణం తీసుకుంటే, బీమా ప్రీమియం రూ.5,000 ఉంటే.. రుణ మొత్తం రూ.5.05 లక్షలు అవుతుంది. తద్వారా అధిక ఈఎంఐకి దారితీస్తుంది.
సంబంధిత కథనం