పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద లోన్​ తీసుకోవాలా? లేక పర్సనల్​ లోన్​ బెటర్​ ఆ? ఎందులో ఆర్థిక భారం తక్కువ?-loan against ppf vs personal loan which is better for you ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద లోన్​ తీసుకోవాలా? లేక పర్సనల్​ లోన్​ బెటర్​ ఆ? ఎందులో ఆర్థిక భారం తక్కువ?

పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద లోన్​ తీసుకోవాలా? లేక పర్సనల్​ లోన్​ బెటర్​ ఆ? ఎందులో ఆర్థిక భారం తక్కువ?

Sharath Chitturi HT Telugu

పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద లోన్​ తీసుకోవాలా? లేక పర్సనల్​ లోన్​ బెటర్​ ఆ? ఈ రెండింటిలో ఎలా తేల్చుకోవాలి? ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పీపీఎఫ్​ మీద లోన్​ వర్సెస్​ పర్సనల్​ లోన్​..

డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు ఇప్పుడు చాలా ఆప్షన్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పర్సనల్​ లోన్​ చాలా ఒకటి. అయితే పీపీఎఫ్​ (పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​)లో మీకు అకౌంట్​ ఉంటే, ఆ బ్యాలెన్స్​ మీ కూడా మీరు లోన్​ తీసుకోవచ్చు అని మీకు తెలుసా? పూర్తి వివరాలు

పీపీఎఫ్​ మీద లోన్​ వర్సెస్​ పర్సన్​ లోన్​..

పీపీఎఫ్​ ఆధారిత లోన్​ అనేది ఒక సెక్యూర్డ్​ లోన్​. ఇందులో వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. కాగా పీపీఎఫ్​ బ్యాలెన్స్​ మీద గరిష్ఠంగా 25శాతం వరకు మాత్రమే లోన్​ లభిస్తుంది. అదే సమయంలో పర్సనల్​ లోన్​ అనేది అన్​-సెక్యూర్డ్​ లోన్​ కిందకు వస్తుంది. లోన్​ తీసుకునే వారి క్రెడిట్​ స్కోర్​ వంటి వివిధ అర్హతల ఆధారంగా రుణం లభిస్తుంది.

విద్య, పెళ్లి, ట్రావెల్​, వైద్యం వంటి భారీ ఆర్థిక అవసరాల విషయంలో పర్సనల్​ లోన్స్​ ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడంలో పీపీఎఫ్​ మీద లోన్​లు సరిపోతాయి.

ఫీచర్​పీపీఎఫ్​ మీద లోన్​పర్సనల్​ లోన్స్​
లోన్​ అమౌంట్​పీపీఎఫ్​ బ్యాలెన్స్​లో 25శాతం వరకుక్రెడిట్​, ఆదాయం ఆధారంగా
వడ్డీ రేటుపీపీఎఫ్​ రేటు కన్నా 1,2శాతం ఎక్కువసాధారణంగా 9.99శాతం నుంచి
కొలాటరల్​పీపీఎఫ్​ బ్యాలెన్స్​అన్​సెక్యూర్డ్​
రీపేమెంట్​ టెన్యూర్​36 నెలల వరకు12 నుంచి 60 నెలల వరకు
ఏడాదికి ఎన్ని లోన్స్​ఆర్థిక సంవత్సరానికి ఒకటిక్రెడిట్​ స్కోర్​, రీపేమెంట్​ ఆధారంగా ఎన్నైనా!
పీపీఎఫ్​ బ్యాలెన్స్​పై ప్రభావంలోన్​ సరైన సమయానికి తీర్చేస్తే ఎలాంటి ప్రభావం ఉండదుఎలాంటి ప్రభావం ఉండదు
నిబంధనలుపెద్దగా ఏమీ లేవుపెద్దగా ఏమీ లేవు
ప్రాసెసింగ్​ టైమ్​కాస్త ఎక్కువేవేగంగా జరిగిపోతుంది

చివనోట్​- ఇది సాధారణంగా ఉండే సమాచారం. వివిధ అంశాల కారణంగా ఇది వ్యక్తిగతంగా మారవచ్చు.

పర్సనల్​ లోన్​తో వచ్చే రిస్క్​లు ఏంటి?

పర్సనల్​ లోన్​ అనేది సులభంగా దక్కుతున్నప్పటికీ, దానితో రిస్క్​లు కాస్త ఎక్కువే అని గుర్తుపెట్టుకోవాలి. అధిక వడ్డీ రేటు, క్రెడిట్​ స్కోర్​పై ప్రభావం, సరైన సమయానికి రీపేమెంట్​ చేయకపోతే క్రెడిట్​ ప్రొఫైల్​ దెబ్బతినడం, అప్పులు పెరిగిపోతే మానసిక ఒత్తిడి వంటి అంశాలు పర్సనల్​ లోన్​తో వచ్చే రిస్క్​లు.

చివరిగా.. చిన్న మొత్తం, షార్ట్​ టర్మ్​ అవసరాలను తీర్చుకునేందుకు మీ పీపీఎఫ్​ బ్యాలెన్స్​పై లోన్​ సరిపోతుంది! అదే అధిక మొత్తంలో ఖర్చుల కోసం పర్సనల్​ లోన్​ని పరిగణించవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం