ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం నుంచి మరొక కీలక అప్డేట్! Llama 4 లో రెండు కొత్త మోడల్స్‌ని లాంచ్ చేసింది మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ. అవి.. Llama 4 Scout (లామా 4 స్కౌట్), Llama 4 Maverick (లామా 4 మేవరిక్). వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ఆధారిత యాప్స్‌లోని చాట్‌బాట్‌కి ఇవి మరింత ‘ఏఐ’ పవర్‌ని ఇవ్వనున్నాయి. వీటిని మెటా వెబ్సైట్, హగ్గింగ్ ఫేస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ మోడళ్లతో పాటు, మెటా లామా 4 బెహెమోత్ అనే మరొక మోడల్ని కూడా ప్రివ్యూ చేసింది. ఇది "ప్రపంచంలోని అత్యంత తెలివైన ఎల్ఎల్ఎమ్లలో ఒకటి. మా కొత్త మోడళ్లకు టీచర్‌గా పనిచేయడానికి మా అత్యంత శక్తివంతమైనది," అని మెటా పేర్కొంది.
మెటా తన లామా 4 మోడళ్లకు పెద్ద మొత్తంలో అన్‌లేబుల్డ్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాపై ముందస్తు శిక్షణ ఇవ్వడం ద్వారా లోకల్ మల్టీమోడల్గా ఈ ఐఏకి శిక్షణ ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మోడల్స్ చిత్రాలు, టెక్స్ట్ రెండింటినీ అర్థం చేసుకోగలవు, ప్రతిస్పందించగలవు.
మెషిన్ లెర్నింగ్ టెక్నిక్‌ని ఉపయోగించడం ద్వారా ఈ కొత్త మోడల్స్ చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్ నుంచి ప్రేరణ పొందాయి. ఇది మెరుగైన పనితీరు, సమర్థతతో నిర్దిష్ట పనుల కోసం మోడల్ వివిధ భాగాలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతిస్తుంది.
అయితే మెటా ప్రకటించిన ఈ కొత్త మోడల్స్ ఏవీ ఓపెన్ ఏఐ ఓ3 మినీ లేదా డీప్‌సీక్ ఆర్1 వంటి రీజనింగ్ మోడల్స్ కావు. రీజనింగ్ నమూనాలు సమాధానాలకు ప్రతిస్పందించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. మరింత క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమాధానాలను పొందడానికి మానవ తరహా ఆలోచనను అనుకరించడం లక్ష్యంగా అవి పనిచేస్తాయి.
లామా 4 మావెరిక్ 128 ఎక్స్పర్ట్స్ 17 బిలియన్ క్రియాశీల పరామీటర్లను కలిగి ఉంది. మావెరిక్ "జనరల్ అసిస్టెంట్- చాట్ యూజ్ కేసుల కోసం ప్రాడక్ట్ వర్క్ హార్స్ మోడల్" అని, ఖచ్చితమైన ఇమేజ్ అవగాహన- సృజనాత్మక రచన సంబంధిత పనులకు అనువైనదని మెటా తెలిపింది.
లామా 4 స్కౌట్ 17 బిలియన్ క్రియాశీల పరామితులు, 16 ఎక్స్పర్ట్స్, 109 బిలియన్ యాక్టివ్ పారామీటర్లతో వస్తుంది. ఈ చిన్న లామా 4 మోడల్ కోడ్ బేస్ కంటే డాక్యుమెంట్ సంక్షిప్తీకరణ, రీజనింగ్ వంటి పనులలో రాణిస్తుందని చెబుతున్నారు.
గెమ్మా 3, జెమినీ 2.0 ఫ్లాష్ లైట్, మిస్త్రాల్ 3.1 వంటి బెంచ్ మార్క్‌లలో స్కౌట్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని మెటా పేర్కొంది.
వాట్సాప్, ఇన్స్ాగ్రామ్, మెసెంజర్, ఇతర కంపెనీ యాప్స్‌లో మెటా ఏఐతో లామా 4 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. 40కి పైగా దేశాల్లోని మెటా ఏఐ ప్రత్యేక వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
అయితే, మెటా ఏఐ మల్టీమోడల్ ఫీచర్లు ప్రస్తుతం యూఎస్‌లోని ఇంగ్లీష్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే మెటా ఏఐతో గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ ఇంకా లేరు.
సంబంధిత కథనం