Livemint: క్రిఫ్ హై మార్క్ తో లైవ్ మింట్ ఒప్పందం; ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెకింగ్
Livemint: పాఠకులకు వారి క్రెడిట్ స్కోర్లకు ఉచితంగా అందించడానికి లైవ్ మింట్ క్రిఫ్ హై మార్క్ తో జతకట్టింది. ఆర్థిక అవగాహనను పెంచడం, వినియోగదారులు వారి క్రెడిట్ హెల్త్ ను పర్యవేక్షించడం, సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
Livemint: ఆర్బీఐ ఆమోదం పొందిన క్రెడిట్ బ్యూరో క్రిఫ్ హై మార్క్ సహకారంతో లైవ్ మింట్ తన పాఠకుల కోసం ఉచిత క్రెడిట్ స్కోర్ సేవను ప్రకటించింది. దీని ద్వారా పాఠకులు తమ క్రెడిట్ స్కోర్లను ఎటువంటి ఖర్చు లేకుండా చెక్ చేసుకోవడానికి లైవ్ మింట్ అవకాశం కల్పిస్తుంది. ఇది పాఠకుల ఆర్థిక అవగాహన, ప్రణాళికకు ఒక ముఖ్యమైన సాధనాన్ని అందిస్తుంది.
క్రెడిట్ స్కోర్ అంటే..
క్రెడిట్ స్కోర్, మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి క్రెడిట్ అర్హతను తెలియజేస్తుంది. క్రెడిట్ హిస్టరీ, రీపేమెంట్ బిహేవియర్ ఆధారంగా క్రిఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్ ను నిర్ణయిస్తాయి. భారతదేశంలో ఆర్బీఐ (RBI) ఆమోదించిన క్రెడిట్ బ్యూరోలలో ఒకటి క్రిఫ్ హై మార్క్. ఇది వ్యక్తులు, ఆర్థిక సంస్థలకు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మీ క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం
- కీలక ఆర్థిక సూచిక: క్రెడిట్ కార్డులు లేదా రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే, రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంక్ లు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉండడమో లేక పూర్తిగా దరఖాస్తు తిరస్కరణకు గురి కావడమో జరుగుతుంది.
- విస్తృత వినియోగం: బ్యాంకులతో పాటు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా క్రెడిట్ అర్హతను అంచనా వేయడానికి క్రెడిట్ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటాయి.
- సాధికారత: మీ క్రెడిట్ స్కోర్ (Credit score) తెలుసుకోవడం మీకు సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి, మీ క్రెడిట్ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
మీ క్రెడిట్ స్కోర్ చెక్
లైవ్ మింట్ ద్వారా ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ www.livemint.com/credit-score లింక్ ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను తెలుసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ లను అందించాలి.
రెగ్యులర్ గా చెక్ చేయాలి
రెగ్యులర్ క్రెడిట్ స్కోర్ మానిటరింగ్ చాలా అవసరం. కారణాలివే..
- సమాచారంతో ఉండండి: రుణాల కొరకు మీ అర్హత, మీరు అందుకునే నిబంధనలను అర్థం చేసుకోండి.
- లోపాలను గుర్తించండి: మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోండి.
- ఫైనాన్షియల్ ప్లానింగ్: రుణాలు మరియు క్రెడిట్ కార్డు (credit cards) లను మెరుగ్గా నిర్వహించడానికి మీ స్కోరును ప్రభావితం చేసే కారకాలను ట్రాక్ చేయండి.
అలాగే, మీ స్వంత క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేయడం క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. సెల్ఫ్ ఎంక్వైరీలు స్కోర్లను ప్రభావితం చేయవు. కాబట్టి అప్డేట్ గా ఉండటానికి కనీసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.