Electric vehicles launch : 2024లో లాంచ్​కు సిద్ధమవుతున్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే!-list of top electric vehicles to launch in 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Vehicles Launch : 2024లో లాంచ్​కు సిద్ధమవుతున్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే!

Electric vehicles launch : 2024లో లాంచ్​కు సిద్ధమవుతున్న టాప్​ ఎలక్ట్రిక్​ కార్లు ఇవే!

Sharath Chitturi HT Telugu
Dec 09, 2023 06:35 AM IST

Electric vehicles launch in 2024 : వచ్చే ఏడాదిలో కొన్ని టాప్​ ఈవీలు లాంచ్​ అవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024లో లాంచ్​కు సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్​ కార్లు ఇవే!
2024లో లాంచ్​కు సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్​ కార్లు ఇవే!

2024 Electric vehicles launch : 2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఆటోమొబైల్​ సంస్థలు.. 2024పై ఫోకస్​ చేశాయి. వచ్చే ఏడాదిలో సరికొత్త మోడల్స్​.. రోడ్లపై దర్శనమివ్వనున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో.. 2024లో కూడా హడావుడి కొనసాగనుంది. అనేక సంస్థలు.. కొత్త కొత్త ఈవీలను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో లాంచ్​కానున్న ఈవీల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

హ్యుందాయ్​ క్రేటా ఈవీ..

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​తో పాటు ఎలక్ట్రిక్​ వెహికిల్​పైనా బజ్​ నెలకొంది. డిజైన్​ పరంగా ఈ రెండు ఒకే విధంగా ఉండనున్నాయి. కేబిన్​ మరింత స్పేషియస్​గా మారనుంది. సరికొత్త టెక్నాలజీ ఇందులో ఉంటుందని టాక్​ నడుస్తోంది. ప్రస్తుతం.. ఈ క్రేటా ఈవీపై సమాచారం లేదు. రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​..

Maruti Suzuki EVX electric suv : మారుతీ సుజుకీ సంస్థ నుంచి వస్త్తున్న తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. ఈవీఎక్స్​ ఎస్​యూవీని సిద్ధం చేస్తోంది సంస్థ. 2024 తొలినాళ్లల్లో.. ప్రొడక్షన్​ని మొదలుపెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. లాంచ్​ కూడా వచ్చే ఏడాదిలోనే ఉండొచ్చు. ఈ ఈవీలో 60కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 550 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది.

టాటా కర్వ్​ ఈవీ..

టాటా కర్వ్​ ఈవీని.. 2023 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది టాటా మోటార్స్​. డిజైన్​ పరంగా అత్యంత స్టైలిష్​గా కనిపిస్తోంది. టెక్నికల్​ వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. 2024లో దీనిని భారతీయుల ముందుకు తీసుకొస్తుంది సంస్థ.

టాటా పంచ్​ ఈవీ..

Tata Punch EV launch : టాటా పంచ్​ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ అయిపోయి ఉండాలి. కానీ.. ఇంకా లాంచ్​ అవ్వలేదు. కాగా.. డిసెంబర్​ 21న ఈ మోడల్​ని సంస్థ రివీల్​ చేస్తుందని తెలుస్తోంది. 2024 సేల్స్​ మొదలవుతాయట. టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటి టాటా పంచ్​. దీని ఈవీ వర్షెన్​ కూడా క్లిక్​ అవుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

మహీంద్రా అండ్​ మహీంద్రా..

మహీంద్రా సంస్థకు ప్రస్తుతం ఒక్కటే ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఉంది. అది మహీంద్రా ఎక్స్​యూవీ400. వచ్చే ఏడాదిలో రెండు ఈవీలు లాంచ్​ అవ్వొచ్చు. అవి మహీంద్రా ఎక్స్​యూవీ.ఈ8, మహీంద్రా ఎక్స్​యూవీ బీఈ.05. వీటిల్లో 80 కేడబ్ల్యూహెచ్​, 60 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎక్స్​యూవీ.ఈ8 అనేది మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఎలక్ట్రిక్​ వర్షెన్​ అని తెలుస్తోంది. పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ కూడా ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి రానున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్​ చేస్తాము. అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగును ఫాలో అవ్వడం మర్చిపోకండి.

Whats_app_banner

సంబంధిత కథనం