Bank holidays in September : సెప్టెంబర్‌లో బ్యాంక్‌లకు 16 రోజుల పాటు సెలవులు!
Bank holidays in September : సెప్టెంబర్‌కు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. ఆ లిస్ట్‌ను ఇక్కడ చూడండి.
Bank holidays in September 2023 : ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవు లభించింది. ఇక పండుగ సీజన్ నేపథ్యంలో.. సెప్టెంబర్‌లో బ్యాంక్‌లు ఏకంగా 16 రోజుల పాటు మూతపడనున్నాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు ఉన్నాయి. బ్యాంక్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్‌ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఇక్కడ చూద్దాము..
సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవులివే..
2023 సెప్టెంబర్ 3:- ఆదివారం
2023 సెప్టెంబర్ 6:- శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 సెప్టెంబర్ 7:- జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 సెప్టెంబర్ 9:- రెండో శనివారం.
September bank holidays : 2023 సెప్టెంబర్ 10:- ఆదివారం
2023 సెప్టెంబర్ 17:- ఆదివారం
2023 సెప్టెంబర్ 18:- వినాయక చవితి, కొన్ని ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 సెప్టెంబర్ 19:- వినాయక చవితి, కొన్ని ప్రాంతాల్లోని బ్యాంక్‌లకు సెలవు.
2023 సెప్టెంబర్ 20:- వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా)
2023 సెప్టెంబర్ 22:- శ్రీ నారాయణ గురు సమాధి డే
2023లో బ్యాంక్ సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2023 సెప్టెంబర్ 23:- నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్ జయంతి
2023 సెప్టెంబర్ 24:- ఆదివారం
2023 సెప్టెంబర్ 25:- శ్రీమత్ సంకరాదేవ జయంతి
2023 సెప్టెంబర్ 27:- ఈద్-ఈ- మిలాద్.
2023 సెప్టెంబర్ 29:- ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఈ సేవలు కొనసాగుతాయి..
Bank holidays list in Telugu : బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.
సంబంధిత కథనం