బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారికి అలర్ట్! మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్‌ని ఆర్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు సెలవులు తీసుకున్న బ్యాంకులు మే 2025లో 12 రోజులు మూతపడనున్నాయి. వివిధ పనుల కోసం బ్యాంకులకు వెళ్లే వారు మే నెల బ్యాంకు సెలవుల లిస్ట్‌ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా మేలో బ్యాంకు సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
మే 1- గురువారం, మహారాష్ట్ర డే, మే డే- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 9- శుక్రవారం, రవీంద్రనాథ్ జయంతి- కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు.
మే 12- సోమవారం, బుద్ధ పూర్ణిమ- అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, దెహ్రూదూన్, ఇటానగర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, దిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, శిమ్లా, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.
మే 16- శుక్రవారం, స్టేట్ డే- గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు.
మే 26- సోమవారం, కాజి నజ్రుల్ ఇస్లామ్- అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.
మే 29- గురువారం, మహారాణ ప్రతాప్ జయంతి- శిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
వీటితో బ్యాంకులకు పాటు వారాంతపు సెలవులు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
4- ఆదివారం
10- రెండో శనివారం
11- ఆదివారం
18- ఆదివారం
24- నాలుగో శనివారం
25- ఆదివారం
నగదు అత్యవసర పరిస్థితుల కోసం అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవు రోజులతో ఎలాటి సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంనైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవని గుర్తుపెట్టుకోవాలి.
ఏది ఏమైనా మే 2025లో బ్యాంకు సెలవుల లిస్ట్‌ని చూసి అందుకు తగ్గట్టుగా కస్టమర్లు కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. పర్సనల్ ఫైనాన్స్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం