Bank holidays in April : 2025 ఏప్రిల్‌లో బ్యాంక్‌లకు 15 రోజుల హాలీడే! ఏ రోజులంటే..
Bank holidays in April : 2025 ఏప్రిల్‌కి సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఆర్బీఐ వెల్లడించింది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు 15 రోజుల పాటు మూతపడి ఉండనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ వారంతో 2025 ఏడాది మూడో నెలకు ముగింపు పడనుంది. ఇక మార్చ్‌లో 12 రోజులు సెలవులు తీసుకున్న బ్యాంక్‌లకు ఏప్రిల్‌లో 15 రోజుల హాలీడేలు ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా సెలవుల లిస్ట్‌ని రిలీజ్ చేసింది. బ్యాంక్ పనుల మీద తిరిగే వారు ఈ 2025 ఏప్రిల్ బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల లిస్ట్..
ఏప్రిల్ 1, మంగళవారం- ఇయర్లీ అకౌంట్స్ క్లౌజర్, అన్ని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 5, శనివారం- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, తెలంగాణ/ హైదరాబాద్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 10, గురువారం- మహావీర్ జయంతి- గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, యూపీ, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 14, సోమవారం- బీఆర్ అంబేడ్కర్ జయంటి, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 15, మంగళవారం- బెంగాల్ నూతన ఏడాది, హిమాచల్ డ, బహోగ్ బిగు- అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 18, శుక్రవారం- గుడ్ ఫ్రైడే- ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 21, సోమవారం- తెగల ఉత్సవం, త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 29, మంగళవారం- పరశురామ్ జయంతి, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు.
ఏప్రిల్ 30, బుధవారం- బసవ జయంతి, కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు.
వారాంతాలు కూడా..
ఏప్రిల్ 6- ఆదివారం
ఏప్రిల్ 12- రెండో శనివారం
ఏప్రిల్ 13- ఆదివారం
ఏప్రిల్ 20- ఆదివారం
ఏప్రిల్ 26- నాలుగో శనివారం
ఏప్రిల్ 27- ఆదివారం
ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథాతథం..
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర హాలీడేలతో ఎలాటి సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంనైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవని గుర్తుపెట్టుకోవాలి.
ఏది ఏమైనా 2025 ఏప్రిల్ బ్యాంక్ సెలవుల లిస్ట్‌ని చూసి అందుకు తగ్గట్టుగా బ్యాంక్ కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. పర్సనల్ ఫైనాన్స్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం