Scooty For Women : మహిళలకు నచ్చే స్కూటీలు.. మీ ప్రియమైన వారి కోసం ఈ వాలెంటైన్స్ డేకి ప్లాన్ చేయెుచ్చు!
Scooty For Women : కొన్ని స్కూటర్లు మహిళలకు చాలా ఇష్టం. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైనవారి కోసం మీరు ప్లాన్ చేయెుచ్చు. ఈ లిస్టులో ఉన్న స్కూటర్లు మహిళలు నడిపేందుకు ఈజీగా ఉంటాయి.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులు, వివాహిత జంటలు కూడా సాధారణంగా వాలెంటైన్స్ డేకి బహుమతులు ఇస్తారు. మీరు కూడా మీరు ప్రేమించిన మహిళకు గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని స్కూటీలు ఉన్నాయి. మీ భార్య, మీ ప్రేయసికి వాలెంటైన్స్ డే సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. మహిళలు నడపడానికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని తేలికైన స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫేమస్ అయిన కొన్ని స్కూటర్ల గురించి తెలుసుకుందాం..
హోండా యాక్టివా 6జీ
హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. యాక్టివా స్కూటర్లు నంబర్ వన్ స్కూటర్‌గా ఉండటానికి ప్రధాన కారణం వాటి మీద ప్రయాణం బాగుంటుంది. ఈ స్కూటర్లు చాలా ఫేమస్. యాక్టివా 6G స్కూటర్ బరువు 107 కిలోలు వరకు ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్
ఈ స్కూటర్ కూడా మహిళలను ఎక్కువగా ఆకర్శిస్తుంది. దీనిని చాలా మంది కొనేందుకు ఇష్టపడుతారు. సీటు కింద పుష్కలంగా స్థలం, శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. జూపిటర్ స్కూటీ బరువు 109 కిలోలు.
టీవీఎస్ స్కూటీ జెస్ట్
ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్. ఈ టీవీఎస్ స్కూటర్ కేవలం 99 కిలోల బరువు ఉంటుంది, తేలికైనది. ఈ స్కూటర్ రూపురేఖలు కూడా సన్నగా, మహిళలు సులభంగా నియంత్రించగలిగేలా రూపొందించారు.
సుజుకి యాక్సెస్ 125
సుజుకి యాక్సెస్ 125 బరువు పైన చెప్పినవాటికంటే కొంచెం ఎక్కువ. అంటే 102 కిలోల వరకు ఉంటుంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి. యాక్సెస్ 125 సౌకర్యవంతమైన సీటింగ్ అమరికతో వస్తుంది.
యమహా ఫాసినో 125
ఈ యమహా స్కూటర్ బరువు 99 కిలోలు మాత్రమే. ఈ ఆధునికంగా కనిపించే స్కూటర్ కొంచెం బొద్దుగా ఉండే శరీరంతో నిర్మించారు. అయితే స్కూటర్ బరువు తక్కువగా ఉండటం వల్ల దానిని నిర్వహించడంలో మహిళలకు సమస్యలు ఉండవు.
హీరో ప్లెజర్ ప్లస్
ఈ స్కూటర్ బరువు 104 కిలోలు. మహిళలకు బాగా నచ్చే డిజైన్‌లో రూపొందించారు. దీనికి అదే ప్లస్ పాయింట్. అదేవిధంగా ప్లెజర్ ప్లస్ స్కూటర్, దాని పెప్పీ ఇంజిన్‌తో రద్దీగా ఉండే రోడ్లపై కూడా నియంత్రించడం సులభంగా ఉంటుంది.