LIC withdraws Jeevan Amar, Tech Term plans: ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్ల నిలిపివేత-lic withdraws jeevan amar tech term insurance plans details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Withdraws Jeevan Amar, Tech Term Insurance Plans. Details Here

LIC withdraws Jeevan Amar, Tech Term plans: ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్ల నిలిపివేత

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 05:52 PM IST

LIC withdraws Jeevan Amar, Tech Term plans: 2019లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ప్రారంభించిన రెండు టర్మ్ పాలసీ ప్లాన్ లు ఇకపై కనిపించవు. వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు LIC ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

LIC withdraws Jeevan Amar, Tech Term plans: జీవిత బీమా సంస్థ LIC రెండు ముఖ్యమైన ప్లాన్లను నిలిపేయాలని నిర్ణయించుకుంది. 2019లో ప్రారంభించిన జీవన్ అమర్(Jeevan Amar), టెక్ టర్మ్(Tech Term) టర్మ్ పాలసీలను ఇకపై కొనసాగించకూడదని ఎల్ ఐ సీ(LIC) నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

LIC withdraws Jeevan Amar, Tech Term plans: జీవన్ అమర్(Jeevan Amar), టెక్ టర్మ్(Tech Term)

జీవన్ అమర్ ప్లాన్ ను 2019 ఆగస్ట్ లో, టెక్ టర్మ్ ప్లాన్ ను 2019 సెప్టెంబర్ లో LIC ప్రారంభించింది. ఈ రెండు ప్లాన్లకు తొలి సంవత్సరం నుంచి ఒకే ప్రీమియం రేట్ ను కొనసాగించింది. వీటిలో టెక్ టర్మ్ అనేది ఆన్ లైన్ పాలసీ కాగా, జీవన్ అమర్ ఆఫ్ లైన్ పాలసీ. ఇకపై ఈ రెండు ప్లాన్లను కొనసాగించరాదని LIC నిర్ణయించింది. ఈ నిర్ణయం నవంబర్ 23 నుంచి అమల్లోకి వస్తుంది. రీ ఇన్సూరెన్స్ రేట్లలో పెరుగుదల కారణంగా ఈ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు LIC అంతర్గత వర్గాలు సమాచారం. ఈ రెండు పాలసీలు దాదాపు ఒకే విధమైన నిబంధనలు కలిగి ఉన్నాయి. పాలసీ దారు చనిపోతే, సమ్ అస్యూర్డ్ నామినీకి అందుతుంది. ఈ రెండు పాలసీల టర్మ్ లను 10 నుంచి 40 ఏళ్లుగా నిర్ధారించారు. జీవన్ అమర్ ప్లాన్ లో కనీసం రూ. 25 లక్షలకు, టెక్ టర్మ్ ప్లాన్ లో కనీసం రూ. 50 లక్షలకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలోనూ గరిష్ట పరిమితి లేదు. ఈ రెండింటిలో జీవన్ అమర్ కన్నా, ఆన్ లైన్ పాలసీ అయిన టెక్ టర్మ్ కొంతవరకు చవకైనది.

LIC withdraws Jeevan Amar, Tech Term plans: ఇప్పటికే ఈ పాలసీ తీసుకున్నవారి పరిస్థితి..

అయితే, ఇప్పటికే ఈ పాలసీ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని LIC వెల్లడించింది. వారి పాలసీ కొనసాగుతుందని వివరించింది. కొత్తగా ఈ పాలసీలను అమ్మబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పాలసీలను తీసుకున్నవారు అన్ని ప్రయోజనాలు పొందుతారని స్పష్టం చేసింది. అలాగే, నవంబర్ 22 వరకు ఈ పాలసీలను కొనుగోలు చేయలని దరఖాస్తులు ఇచ్చిన వారు కూడా ఆందోళన చెందననవసరం లేదని LIC తెలిపింది. వారి అప్లికేషన్లను పరిశీలించి, అన్ని సరిగ్గా ఉంటే, నవంబర్ 30 లోగా వారికి పాలసీని అందిస్తామని తెలిపింది.

WhatsApp channel