LIC share price : భారీగా పెరిగిన ఎల్​ఐసీ షేర్లు.. టార్గెట్​ రూ. 917!-lic share price jump to see best intraday gain since listing buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Share Price Jump To See Best Intraday Gain Since Listing, Buy?

LIC share price : భారీగా పెరిగిన ఎల్​ఐసీ షేర్లు.. టార్గెట్​ రూ. 917!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 11:05 AM IST

LIC share price : క్యూ2లో మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో ఎల్​ఐసీ షేర్లు దూసుకెళుతున్నాయి. మరి ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? టార్గెట్​ ప్రైజ్​ ఎంత?

భారీగా పెరిగిన ఎల్​ఐసీ షేర్లు.. టార్గెట్​ రూ. 917!
భారీగా పెరిగిన ఎల్​ఐసీ షేర్లు.. టార్గెట్​ రూ. 917! (Bloomberg)

LIC share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎల్​ఐసీ స్టాక్​ దూసుకెళుతోంది! ఎల్​ఐసీ షేర్లు.. ప్రస్తుతం దాదాపు 6శాతం లాభాల్లో ఉన్నాయి. 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో సంస్థ ఫలితాలు మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఎల్​ఐసీకి.. లిస్టింగ్​ సమయం నుంచి ఇదే ది బెస్ట్​ ఇంట్రా డే పర్సెంటేజ్​ గెయిన్​ అని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

త్రైమాసిక ఫలితాలు..

బీమా రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ఎల్​ఐసీ క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపింది. నెట్​ ప్రాఫిట్​ భారీగా పెరిగి రూ. 15,952కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,434కోట్లుగా ఉంది. ప్రీమియం ఇన్​కమ్​ పెరగడం, అకౌంటింగ్​ పాలసీలో కీలక మార్పులు చేయడంతో ఇది సాధ్యమైంది.

ఈ ఆర్థిక సంవత్సరం జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎల్​ఐసీ నికర లాభం రూ. 682.9 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

ఎల్​ఐసీ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

టార్గెట్​ రూ. 917…!

LIC share price target : ఈ నేపథ్యంలో ఎల్​ఐసీ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 917 నిర్ణయించింది ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్​.

"ఛార్ట్​ పాటర్న్​ ప్రకారం.. 700 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది బ్రేక్​ అయ్యేంత వరకు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఎదురుచూడాలి. రూ. 700పైన క్లోజ్​ అయితే.. ఎల్​ఐసీ షేరు ధర అక్కడి నుంచి భారీగా పెరిగే అవకాశం ఉంది. రూ. 600 వద్ద కొని, రూ. 580ని స్టాప్​ లాస్​ పెట్టాలి. లేదా.. రూ. 700 వద్ద ఎల్​ఐసీ షేర్లను కొని, రూ. 630 వద్ద స్టాప్​ లాస్​ పెట్టాలి," అని ఛాయిస్​ బ్రోకింగ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

"ఛార్ట్​ పాటర్న్​ను గమనిస్తే.. ఎల్​ఐసీ స్టాక్​లో ట్రెండ్​ రివర్స్​ అయినట్టు కనిపిస్తోంది. స్వల్ప కాలంలో షేరు ధర రూ. 700- రూ. 720కి వెళ్లొచ్చు. స్టాప్​ లాస్​గా రూ. 630ని పెట్టుకోవచ్చు. షార్ట్​ టర్మ్​ వ్యూతో కొత్తగా ఎంట్రీని ప్లాన్​ చేయాలని భావిస్తున్న పెట్టుబడిదారులు.. ప్రస్తుత ధర వద్ద కొని రూ. 720 దగ్గర ప్రాఫిట్​ను బుక్​ చేసుకోవచ్చు. స్టాప్​ లాస్​గా రూ. 630 ఉంటుంది," అని ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​ వైస్​ ప్రెసిడెట్​ అనూజ్​ గుప్త తెలిపారు.

ఎల్​ఐసీ స్టాక్​ ప్రైజ్​..

LIC Q2 results 2022 : భారీ అంచనాలతో మే నెలలో లిస్ట్​ అయిన ఎల్​ఐసీ స్టాక్​.. ఇప్పటివరకు మదుపర్లకు నష్టాలనే మిగిల్చింది! ఎల్​ఐసీ షేర్లు.. ఈ ఏడాదిలో 24.4శాతం పతనమయ్యాయి. కానీ నెల రోజుల్లో మాత్రం 7.9శాతం పెరిగాయి. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 4.75శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఈ ఒక్క రోజే.. 5.46శాతం లాభాల్లో ట్రేడ్​ అవుతోంది ఎల్​ఐసీ షేరు.

WhatsApp channel

సంబంధిత కథనం