LIC Q2 results: భారీగా పెరిగిన ఎల్ఐసీ లాభాలు-lic q2 results pat rises multi fold to rs 15 952 cr net premium income up 27 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Q2 Results: Pat Rises Multi-fold To <Span Class='webrupee'>₹</span>15,952 Cr, Net Premium Income Up 27%

LIC Q2 results: భారీగా పెరిగిన ఎల్ఐసీ లాభాలు

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 09:07 PM IST

LIC Q2 results: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(Q2) భారీ లాభాలను చవి చూసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

LIC Q2 results: LIC నికర ప్రీమియం ఆదాయం ఈ Q2లో రూ. 1.32 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరం Q2 ప్రీమియం ఆదాయం కన్నా27% ఎక్కువ. గత ఏడాది Q2లో LIC నికర ప్రీమియం ఆదాయం రూ. 1.04 లక్షల కోట్లు.

ట్రెండింగ్ వార్తలు

LIC Q2 results: లాభాల పంట

ఈ Q2లో సంస్థ నికర లాభాలు భారీగా పెరిగాయి. Q2 ఫలితాలను LIC శుక్రవారం ప్రకటించింది. ఈ Q2లో ఎల్ఐసీ నికర లాభం(పన్ను అనంతర లాభం- profit after tax - PAT) గత ఆర్థిక సంవత్సరం Q2 తో పోలిస్తే కొన్ని రెట్లు పెరిగింది. ఈ Q2లో సంస్థ నికర లాభాలు రూ. 15,952 కోట్లు కాగా, గత Q2లో LIC నికర లాభం రూ. 1,434 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే, అకౌంటింగ్ పాలసీలో చేసిన మార్పు కారణంగానే ఈ స్థాయిలో లాభాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికం(Q1)లో LIC నికర లాభం రూ. 682.9 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

LIC Q2 results: నికర ప్రీమియం ఆదాయంలో భారీ పెరుగుదల

LIC నికర ప్రీమియం ఆదాయంలో ఈ Q2లో భారీ పెరుగుదల నమోదైంది. అలాగే, పెట్టుబడుల ద్వారా లభించిన నికర ఆదాయం గత సంవత్సరం Q2తో పోలిస్తే.. 10% పెరిగింది. ఈ సంవత్సరం Q2లో పెట్టుబడులపై నికర ఆదాయం రూ. 84,104 కోట్లు. తొలి సారి చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 9124.7 కోట్లు. తొలి ప్రీమియం చెల్లింపు మొత్తం బిజినెస్ లో పెరుగుదలను సూచిస్తుంది. అలాగే రెన్యువల్ ప్రీమియం ఆదాయం గత Q2తో పోలిస్తే 2% పెరిగింది. ఈ Q2లో రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ. 56,156 కోట్లుగా తేలింది. అలాగే, సింగిల్ ప్రీమియం ఆదాయం గత Q2 తో పోలిస్తే 62% పెరిగి, రూ. 66,901 కోట్ల వద్ద నిలిచింది.

LIC Q2 results: ఎన్ఫీఏల పరిస్థితి మెరుగు..

LIC నిరర్ధక ఆస్తుల విలువ ఈ Q2లో రూ. 26,111 కోట్లుగా ఉంది. ఈ Q1లో ఇది రూ. 26 619 కోట్లు. అలాగే, గత Q2లో ఎన్పీఏల విలువ రూ. 28, 929 కోట్లు. అంటే, ఎల్ఐసీ నిరర్ధక ఆస్తుల విలువ క్రమంగా తగ్గుతోంది. ఇది సంస్థకు ఆశాజనక వార్త.

షేరు విలువలో కాస్త మెరుగుదల

Q2లో భారీ లాభాలను ప్రకటించబోతోందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం LIC షేరు విలువ 1.17% పెరిగింది. శుక్రవారం ఈ షేరు విలువ రూ. 628.05 వద్ద నిలిచింది. అయితే, లిస్టింగ్ ధర అయిన 872తో పోలిస్తే.. ఇప్పటికీ ఇది చాలా తక్కువే.

WhatsApp channel