LIC bonus and dividend : ఎల్​ఐసీ షేర్​హోల్డర్లకు భారీగా డివిడెండ్లు.. బోనస్​ షేర్లు!-lic plans bonus shares higher dividend to shore up confidence in stock says report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Plans Bonus Shares, Higher Dividend To Shore Up Confidence In Stock Says Report

LIC bonus and dividend : ఎల్​ఐసీ షేర్​హోల్డర్లకు భారీగా డివిడెండ్లు.. బోనస్​ షేర్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 29, 2022 07:25 AM IST

LIC bonus shares and dividend : షేర్​హోల్డర్లకు బోనస్​ షేర్లు, భారీ మొత్తంలో డివిడెండ్లు ఇచ్చేందుకు ఎల్​ఐసీ, కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఎల్​ఐసీ స్టాక్​ ధర పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ఎల్​ఐసీ షేర్​ హోల్డర్లకు భారీగా డివిడెండ్లు..!
ఎల్​ఐసీ షేర్​ హోల్డర్లకు భారీగా డివిడెండ్లు..! (MINT)

LIC bonus shares and dividend : ఐపీఓ నాటి నుంచి షేర్​హోల్డర్లకు చేదు అనుభవాన్నే ఇస్తోంది ఎల్​ఐసీ(లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ కార్ప్​ ఆఫ్​ ఇండియా). 5 నెలలుగా ఎల్​ఐసీ షేర్లు పడుతూనే ఉన్నాయి. ఫలితంగా మదుపర్లలో ఎల్​ఐసీ స్టాక్​పై ఆసక్తి తగ్గింది! ఇక ఇప్పుడు.. మదుపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోనస్​ షేర్లు, భారీగా డివిడెండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ పతనం..

ఈ ఏడాది మేలో.. ప్రభుత్వ ఆధారిత ఎల్​ఐసీ స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యింది. భారీ అంచనాలతో అడుగుపెట్టిన ఎల్​ఐసీ ఐపీఓ డీలా పడింది. రూ. 949ను అలాట్​మెంట్​​ ప్రైజ్​గా నిర్దేశించగా.. తొలిరోజు 8శాతం నష్టాల వద్ద ఓపెన్​ అయ్యింది. అప్పటికే మదుపర్లు నష్టపోయారు. ఇక ఇప్పుడు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి ఎల్​ఐసీ షేరు రూ. 592.65 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్​ క్యాపిటల్​.. ఒకప్పుడు రూ. 6లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు రూ. 3.75లక్షల కోట్లకు పడిపోయింది.

LIC share price : ఈ క్రమంలో షేరు ధరను ప్రభావితం చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్​ఐసీ ఎన్​పీఎఫ్​(నాన్​ పార్టిసిపేటింగ్​ ఫండ్​)లో రూ. 11.57ట్రిలియన్లు ఉన్నాయి. వాటిల్లో నుంచి రూ. 1.8ట్రిలిన్​(21.83బిలియన్​ డాలర్లు)ను తీసి షేర్​హోల్డర్​ ఫండ్​కు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

జీవిత బీమా సంస్థలు.. సాధారణంగా రెండు రకాల ప్రాడక్టులను అమ్ముతుంటాయి. ఒకటి.. పార్టిసిపెంటింగ్​ పాలసీ. ఇందులో లాభాలను కస్టమర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది.. నాన్​ పార్టిసిపేటింగ్​ పాలసీ. ఇందులో ఫిక్స్​డ్​ రిటర్నులు ఉంటాయి. ఇందులో వచ్చే ప్రీమియంను నాన్​ పార్టిసిపేటింగ్​ ఫండ్​లో వేస్తుంది ఎల్​ఐసీ. సంస్థ బోర్డు ఆమోదంతో.. ఈ నగదును షేర్​హోల్డర్లకు డివిడెండ్ల రూపంలో అందివొచ్చు.

 ఇలా.. ఫండ్స్​ను షేర్​హోల్డర్లకు పంచితే.. మదుపర్లలో నమ్మకం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో కూడా డివిడెండ్లు భారీగా పెరుగుతాయన్న విశ్వాసం మదుపర్లలో ఉంటుందని, అందువల్ల ఎల్​ఐసీ షేర్లను కొనుగోలు చేస్తారని ధీమాగా ఉన్నట్టు పేర్కొన్నాయి.

బోనస్​ షేర్లు, డివిడెండ్లు.. ఈ రెండింట్లో ఏదో ఒకటే జరగవచ్చని తెలుస్తోంది.

కాగా.. ఈ వార్తలపై ఎల్​ఐసీ, కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా స్పందించలేదు. కాగా.. మదుపర్లను ఆకర్షించడంపై ఇటీవలే ఎల్​ఐసీకి మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం. సంస్థను లాభాల బాట పట్టించే దిశగా వ్యూహాలను మార్చాలని సంస్థ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది.

LIC share price target : ఎల్​ఐసీకి 7 బ్రోకరేజీ సంస్థలు 'బై' రేటింగ్​ ఇచ్చాయి. టార్గెట్​ ప్రైజ్​ని రూ. 840గా పేర్కొన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం