LIC Jeevan Saral policy: మంచి ఇన్ కం ప్లాన్ కోసం చూస్తున్నారా? ఇది మీ కోసమే..-lic jeevan saral pay once get rs 52 000 pension purchase eligibility details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lic Jeevan Saral: Pay Once, Get <Span Class='webrupee'>₹</span>52,000 Pension; Purchase, Eligibility Details

LIC Jeevan Saral policy: మంచి ఇన్ కం ప్లాన్ కోసం చూస్తున్నారా? ఇది మీ కోసమే..

HT Telugu Desk HT Telugu
Jan 06, 2023 06:31 PM IST

LIC Jeevan Saral policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC).. భారతీయులకు అత్యంత విశ్వసనీయ బీమా కంపెనీ. మార్కెట్ లీడర్ గా ఉన్న LIC నుంచి Jeevan Saral పేరుతో మంచి ఇన్ కం ప్లాన్ వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

LIC Jeevan Saral policy: ఉద్యోగి జీవితంలో రిటైర్ మెంట్ ఒక కీలక మలుపు. ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగి, ప్రశాంత జీవనం గడపడానికి తొలి మెట్లు రిటైర్ మెంట్. అయితే, దానికి కూడా సరైన ఆదాయ మార్గం ఉండాల్సిందే. రిటైర్ మెంట్ అనంతరం రెగ్యులర్ గా ఆదాయం ఇచ్చే బీమా పాలసీ ఎల్ఐసీ(LIC) లో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

LIC Jeevan Saral policy: ఎల్ఐసీ జీవన్ సరళ్

ఎల్ఐసీ జీవన్ సరళ్(LIC Jeevan Saral policy) పాలసీలో బీమా కవరేజీతో పాటు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. అయితే, ఈ Jeevan Saral పాలసీని పొందడానికి కొన్ని నిబంధనలున్నాయి. ఈ పాలసీతో ఫిక్స్డ్ ఆదాయం లభిస్తుంది. ఆ ఆదాయాన్ని సంవత్సరానికి ఒకసారి కానీ, ఆరు నెలలకు ఒకసారి కానీ, మూడు నెలలకు ఒకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ పొందవచ్చు. అలాగే, Jeevan Saral పాలసీ పేమెంట్ కు సంబంధించి కూడా పలు ఆప్షన్స్ ఉన్నాయి. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న భారతీయ పౌరుడు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ జీవన్ సరళ్() పాలసీని పూర్తిగా ఐఆర్ డీఏ(IRDA) నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు.

Jeevan Saral policy: ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ఈ జీవన్ సరళ్(Jeevan Saral) పాలసీని ఎస్ఐసీ అధికారిక వెబ్ సైట్ LICIndia.in నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఏజెంట్ ద్వారా ఆఫ్ లైన్ లోనూ ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియంను ఒకేసారి లమ్సమ్ గా పే చేయాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కు ఇది మరో ఆదాయ మార్గంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఈ Jeevan Saral పాలసీలో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ఆ వ్యక్తి ఏటా రూ. 52 వేల పెన్షన్ పొందుగలరు. పెట్టుబడి మొత్తం పెరుగుతున్న కొద్దీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. గరిష్టంగా నెలవారీ పెన్షన్ రూ. 12 వేల వరకు పొందవచ్చు. ఈ పాలసీ ఇచ్చే ముందు మెడికల్ టెస్ట్ చేసుకోవాలని ఎల్ఐసీ(LIC) కోరుతుంది.

WhatsApp channel

టాపిక్