Natural care : చర్మం, జుట్టు సంరక్షణ కోసం ‘నేచురల్​ కేర్​’.. సరికొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​!-lee health domain launches natural care to rejuvenate hair and skin ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Natural Care : చర్మం, జుట్టు సంరక్షణ కోసం ‘నేచురల్​ కేర్​’.. సరికొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​!

Natural care : చర్మం, జుట్టు సంరక్షణ కోసం ‘నేచురల్​ కేర్​’.. సరికొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​!

Sharath Chitturi HT Telugu

Natural care : లీ హెల్త్​ డొమైన్​ అనే ఫార్మా సంస్థ.. సరికొత్త కాంబో కిట్​ను లాంచ్​ చేసింది. ఇందులోని ప్రాడక్ట్స్​తో జుట్టు రాలే సమస్య దూరమవుతుందని చెబుతోంది.

చర్మం, జుట్టు సంరక్షణ కోసం ‘నేచురల్​ కేర్​’

Natural care products : జుట్టు, చర్మ సంరక్షణ కోసం సరికొత్త కాంబో కిట్​ను లాంచ్​ చేసింది హైదరాబాద్​ ఆధారిత ఫార్మా సంస్థ 'లీ హెల్త్​ డొమైన్​'. 'నేచురల్​ కేర్​' బ్రాండ్​ కింద వీటిని విక్రయించనుంది. ఈ కిట్​లో హెయిర్​ ఆయిల్​, షాంపూ, సాఫ్ట్​ జెల్​ కాప్స్యూల్స్​ వంటివి ఉంటాయి. మహిళలతో పాటు పురుషులు కూడా తమ ప్రాడక్ట్స్​ ఉపయోగించవచ్చని సంస్థ చెబుతోంది.

సరికొత్త ప్రాడక్ట్స్​..

వయస్సుతో సంబంధం లేకుండా.. ఈ మధ్య కాలంలో పురుషులు, మహిళల్లో జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. పోషకాలు సరిగ్గా అందకపోవడం, అనారోగాలు, లైఫ్​స్టైల్​ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. అయితే.. అధిక రసాయనాలతో కూడిన షాంపూలను వాడుతుండటం కూడా హెయిర్​ లాస్​కు ఓ కారణం. ఈ నేపథ్యంలో విస్త్రతస్థాయి పరిశోధనల తర్వాత.. అరుదైన బొటానికల్​ ఎక్స్​ట్రాక్ట్స్​, హై పొటెంట్​ బయోప్రోటీన్​ కాంపాడ్స్​తో కలిపి ఓ ఫార్ములాను రూపొందించింది లీ హెల్త్​ డొమైన్​. వీటితో షాంపూలు, సాఫ్ట్​ జెల్​ క్యాప్సుల్స్​ను రూపొందించింది.

Lee Health Domain natural care : హైబిస్కస్​, ఉల్లి, అలోవెరా, భ్రింగ్​రాజ్​, ఆమ్లా వంటి పదార్థాలతో 100శాతం హెర్హల్​ హెయిర్​ ఆయిల్​ని రూపొందించింది ఫారమా సంస్థ. పేరుకు తగ్గట్టుగానే.. ఈ నేచురల్​ కేర్​ ఉత్పత్తుల్లో కెమికల్​ కాంపౌండ్స్​ ఉండవని సంస్థ స్పష్టం చేసింది. ఫలితంగా చుండ్రు సమస్య తగ్గుతుందని, జుట్టు రాలడం ఆగుతుందని, చర్మం రెజువనేట్​ అవుతుందని వెల్లడించింది.

"జుట్టు రాలే సమస్యకు మూల కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని తెలుసుకుని మేము కొత్త ప్రాడక్ట్స్​ని రూపొందించాము. వయస్సుతో సంబంధం లేకుండా.. పురుషులు, మహిళలు వీటిని ఉపయోగించుకోవచ్చు," అని సంస్థ డైరక్టర్​ అల్లా లీలా రాణి తెలిపారు.

ఆసక్తిగల వారు మూడు ఉత్పత్తులతో కూడిన కాంబో కిట్​ను అమెజాన్​ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సంస్థ అధిరాకి వెబ్​సైట్​ www.leehealthdomain.com నుంచి కూడా కొనుక్కోవచ్చు.

లీ హెల్త్​ డొమైన్​ నుంచి మార్కెట్​లో ఇప్పటికే వివిధ ప్రాడక్ట్స్​ అందుబాటులో ఉన్నాయి. స్మూత్​వాక్​ ట్యాబ్లెట్స్​, స్పినోకార్ట్​ క్యాప్సుల్స్​, డీ-మకులా, రోల్​ ఆన్​ కోల్డ్​, వాసు తులసి కాఫ్​ సిరప్​, మల్టీ లీఫెక్స్​ స్మూత్​వాక్​ ఆయింట్​మెంట్​ వంటివి సంస్థకు చెందిన కొన్ని ఉత్పత్తులు. వీటికి మంచి డిమాండ్​తో పాటు మంచి రివ్యూలు కూడా లభిస్తున్నాయి.

Natural shampoo for hair wash : "సహజ సిద్ధమైన పదార్థాలతో ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్​ వంటి వాటిని ఉత్పత్తులను తయారు చేయడం మా బలం," అని సంస్థ చెబుతోంది.

సంబంధిత కథనం