ధర రూ. 6,499- కానీ ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది.. బడ్జెట్​లో బెస్ట్​!-lava yuva star 2 budget phone with android go launched check price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ధర రూ. 6,499- కానీ ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది.. బడ్జెట్​లో బెస్ట్​!

ధర రూ. 6,499- కానీ ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ ఇది.. బడ్జెట్​లో బెస్ట్​!

Sharath Chitturi HT Telugu

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 గో తదితర ఫీచర్లతో లావా యువ స్టార్ 2 స్మార్ట్​ఫోన్ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

లావా యువ స్టార్​ 2 (Lava)

దేశంలోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఎంట్రీ ఇచ్చింది. లావా సంస్థ తన కొత్త స్మార్ట్​ఫోన్​ యువ స్టార్​ 2ని లాంచ్​ చేసింది. 2024 ఆగస్ట్​లో లాంచ్​ అయిన యువ స్టార్​కి ఇది సక్సెసర్​గా వస్తోంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 గో, లో-ఎండ్ డివైజ్ల కోసం రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్​ సహా ఈ కొత్త మోడల్ అనేక అప్​గ్రేడ్స్​తో వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధరతో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లావా యువ స్టార్ 2: ధర- లభ్యత..

లావా యువ స్టార్ 2 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. సింగిల్ కాన్ఫిగరేషన్​లో వస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. రూ.6,499 ధర కు ఈ ఫోన్ రేడియంట్ బ్లాక్ , స్పార్కింగ్ ఐవరీ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. 8 జీబీ వరకు ర్యామ్​ని వర్చువల్​గా ఎక్స్​ప్యాండ్​ చేసుకోవచ్చు. మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​కి కూడా మద్దతు ఇస్తుంది. యువ స్టార్ 2 ఎంపిక చేసిన రిటైల్ ఔట్​లెట్స్​లో ఇప్పటికే అమ్మకానికి వచ్చింది.

యువ స్టార్ 2 : స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ యువ స్టార్ 2లో 6.75 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే, నిగనిగలాడే రేర్ డిజైన్ ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ సహా డ్యుయెల్​ కెమెరా సెటప్​ రేర్​లో ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కోసం 10వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

భద్రత కోసం, యువ స్టార్ 2లో సైడ్ మౌంటెడ్ ఫింగర్​ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్​లాక్ రెండూ ఉన్నాయి. పరికరం పనితీరును పెంచడానికి అదనంగా 4 జీబీ వర్చువల్ ర్యామ్​ని అందిస్తుంది. వివిధ పనులకు కూడా సజావుగా పనిచేస్తుందని ఇది నిర్ధారిస్తుంది.

పరిమిత హార్డ్​వేర్ సామర్థ్యాలతో ఎంట్రీ లెవల్ స్మార్ట్​ఫోన్ల కోసం రూపొందించిన ఆండ్రాయిడ్ 14 గో ఆపరేటింగ్ సిస్టెమ్​పై ఈ ఫోన్ పనిచేయనుంది. బ్యాక్​గ్రౌండ్​ ప్రాసెసింగ్​ని తగ్గించడం ద్వారా, గూగుల్ ప్రధాన యాప్​ల లైట్​ వెర్షన్లను కలిగి ఉండటం ద్వారా ఈ స్మార్ట్​ఫోన్​ వేగవంతమైన, మరింత సమర్థవంతమైన యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ని అందిస్తుంది.

రోజువారీ పనులకు విశ్వసనీయమైన స్మార్ట్​ఫోన్​ కావాలనుకునే బడ్జెట్-స్పృహ ఉన్న వినియోగదారులకు ఇది అనువైన ఎంపికగా మారుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

త్వరలోనే మరో స్మార్ట్​ఫోన్​..

ఇతర వార్తల విషయానికొస్తే.. త్వరలో నియో 10 స్మార్ట్​ఫోన్​​ని భారత్​లో లాంచ్ చేస్తున్నట్టు ఐక్యూ ధృవీకరించింది. నియో 10ఆర్​ని ఇంతకుముందు లాంచ్ చేసిన తరువాత నియో 10 లైనప్​లో ఇది రెండవది. ఐక్యూ మొదట నవంబర్ 2024లో నియో 10 సిరీస్​ని చైనాలో ప్రవేశపెట్టింది. రాబోయే మోడల్ త్వరలో భారతదేశంలో అధికారికంగా లాంచ్​ అవుతుందని భావిస్తున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం