Best budget smartphone : 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఏఐ కెమెరా.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 6,000 మాత్రమే!-lava yuva smart budget friendly smartphone launched in india check price features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Budget Smartphone : 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఏఐ కెమెరా.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 6,000 మాత్రమే!

Best budget smartphone : 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, ఏఐ కెమెరా.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 6,000 మాత్రమే!

Sharath Chitturi HT Telugu
Jan 28, 2025 05:43 AM IST

Lava Yuva Smart : లావా యువ స్మార్ట్​.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, భారీ డిస్​ప్లే, పవర్​ఫుల్​ ఫీచర్స్​తో భారత బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది. ఈ గ్యాడ్జెట్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Lava's budget-friendly device - Yuva Smart has been launched in India at Rs. 6,000.
Lava's budget-friendly device - Yuva Smart has been launched in India at Rs. 6,000. (Lava)

బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో హీట్​ని మరింత పెంచుతూ సరికొత్త గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది లావా. ఈ మోడల్​ పేరు లావా యువ స్మార్ట్​. దీని ధర కేవలం రూ. 6వేలు! ఇంత తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్​ని సంస్థ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యువ స్మార్ట్: స్పెసిఫికేషన్స్- ఫీచర్స్..

లావా యువ స్మార్ట్ స్మార్ట్​ఫోన్ యూఎన్​ఐఎస్​ఓసీ 9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.75 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లేని ఈ మొబైల్​ కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ పరంగా, లావా యువ స్మార్ట్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇందులో మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఏఐ కెమెరా ఉంది. విభిన్న లైటింగ్​లో మంచి ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఇది హెచ్​డీఆర్, పోర్ట్రెయిట్- నైట్ వంటి వివిధ మోడ్​లను సపోర్ట్ చేస్తుంది. ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా, స్క్రీన్ ఫ్లాష్ వంటివి సెల్ఫీలు, వీడియో కాల్స్​కి క్లారిటీని ఇస్తాయి.

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10వాట్ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్​ను సపోర్ట్ చేస్తుంది. 30 గంటల టాక్ టైమ్​ని అందిస్తుంది. ఇది రోజంతా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 గో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్, అదనంగా 3 జీబీ వర్చువల్ ర్యామ్​తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ కూడా అందిస్తుంది. ఇది 512 జీబీ వరకు ఎక్స్​ప్యాండ్​ అవుతుంది. వినియోగదారులు అనేక రకాల యాప్స్​, మీడియా ఫైల్స్​ని స్టోర్​ చేసుకోవచ్చు.

అంతేకాకుండా భద్రత కోసం, లావా యువ స్మార్ట్​లో ఫేస్ అన్​లాక్, సైడ్ ఫింగర్​ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్ 4జీ వోల్టే, వై-ఫై, బ్లూటూత్ 4.2, ఓటీజీ సపోర్ట్ ఉన్నాయి.

లావా యువ స్మార్ట్: ధర, లభ్యత..

లావా యువ స్మార్ట్ స్మార్ట్​ఫోన్​ రూ.6,000కే లభ్యమవుతోంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. గ్లోసీ బ్లూ, గ్లోసీ వైట్, గ్లోసీ లావెండర్. లావా యువ స్మార్ట్ కోసం ఉచిత ఎట్-హోమ్ సర్వీస్​తో పాటు ఒక సంవత్సరం వారంటీని కూడా సంస్థ అందిస్తోంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుసుకునేందుకు హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి!

Whats_app_banner