Best smartphone : 7వేలకే ఈ ఆల్‌రౌండర్ స్మార్ట్‌ఫోన్ వస్తుంటే- ఇక ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు?
Lava Yuva 4 : బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో సంచలనం! ఆల్‌రౌండర్ ఫీచర్స్‌తో రూ. 7వేల ధరకే లావా యువ 4జీ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ ఫోకస్డ్ వై సిరీస్ లైనప్‌లో లావా తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దీని పేరు లావా యువ 4. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ హెచ్డీ+ డిస్ప్లే, యాడ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఎక్స్‌పీరియెన్స్ వంటివి ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకతలున్నాయి. లావా నుంచి వచ్చిన ఈ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ చూసేయండి..
లావా యువ 4: మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు..
డిస్ప్లే, సాఫ్ట్వేర్:
లావా యువ 4 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత లావా సొంత కస్టమ్ స్కిన్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.
ప్రాసెసర్:
లావా యువ 4 స్మార్ట్‌ఫోన్ 12ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారిత యూనిసోక్ టీ 606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది! మాలి- జీ57 ఎంసీ2 జీపీయూతో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది సంస్థ. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 512 జీబీ వరకు ఎక్స్టర్నల్ స్టోరేజ్‌ని కూడా ఈ గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది.
కెమెరా:
ఆప్టిక్స్ విషయానికొస్తే, 50 మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉన్నాయి. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంంది ఈ ఫోన్.
కనెక్టివిటీ:
లావా యువ 4లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎఫ్ ఎం రేడియో, 4జీ వీఓఎల్ టీఈ, బ్లూటూత్ 5.0, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్, డేటా ట్రాన్స్ ఫర్ కోసం యూఎస్ బీ-సీ వంటి కనెక్టివిటీ ఉన్నాయి.
ధర, కలర్ వేరియంట్:
లావా యువ 4 మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అవి.. గ్లాసీ వైట్, గ్లాసీ పర్పుల్, గ్లాసీ బ్లాక్.
ఇక 4 జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ లావా యువ్ వేరియంట్ ధర రూ.6,999గా ఉంది.
ఇటీవల చేసిన అగ్ని 3 మాదిరిగానే లావా కూడా యువ 4తో 1 సంవత్సరం పాటు ఉచిత సర్వీస్- ఎట్- హోమ్ సదుపాయాన్ని అందిస్తోంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం