లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, సరసమైన ధరల్లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు గ్యాడ్జెట్స్ స్టార్మ్ సిరీస్‌లో భాగంగా వస్తున్నాయి. వీటి పేర్లు.. స్టార్మ్ ప్లే, స్టార్మ్ లైట్. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకంగా అమెజాన్‌లో లభించనున్నాయి. స్టార్మ్ ప్లే జూన్ 19 నుంచి రూ. 9,999కి అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్మ్ లైట్ జూన్ 24 నుంచి రూ. 7,999కి లభిస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ కలిగి ఉన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌గా నిలించి లావా స్టార్మ్ ప్లే. రూ. 10,000 లోపు సెగ్మెంట్‌లో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉన్న మొదటి హ్యాండ్‌సెట్ కూడా ఇదే!
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.75-ఇంచ్ హెచ్డీ+ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే ఇందులో సోనీ ఐఎంఎక్స్752 సెన్సార్‌తో 50ఎంపీ డ్యూయల్ రేర్ లెన్స్, 8ఎంపీ ఫ్రంట్ లెన్స్ ఉన్నాయి.
ఈ స్టార్మ్ ప్లేలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. 6జీబీ ర్యామ్ (అదనంగా 6GB ఎక్స్ప్యాండెబుల్), 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని సొంతం.ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
ఈ గ్యాడ్జెట్‌తో ఒక ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను లావా అందిస్తుంది.
భారతదేశంలో మొదటిది: రూ. 8,000 లోపు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించిన మొదటి భారతీయ స్మార్ట్‌ఫోన్ ఈ లావా స్టార్మ్ లైట్.
డిస్‌ప్లే: 6.75-అంగుళాల HD+ స్క్రీన్.
కెమెరా: 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్752 రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా.
పర్ఫార్మెన్స్: AnTuTu స్కోర్‌లో 410,000 కంటే ఎక్కువ స్కోరు సాధించింది. రోజువారీ పనులకు నమ్మకమైన పనితీరును కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
ర్యామ్- స్టోరేజ్: 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లు. 4జీబీ ర్యామ్ (అదనంగా 4GB వర్చువల్లీ ఎక్స్ప్యాండెబుల్).
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15.
ఛార్జింగ్: 15W టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్.
బ్యాటరీ: 5000ఎంఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేకతలు: స్టార్మ్ ప్లే లాగానే, ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.
ఈ రెండు ఫోన్‌లు అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి. భారతదేశం అంతటా లావా "Free Service@Home" సౌకర్యంతో వస్తాయి. ఈ సర్వీస్ గురించి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం