Prowatch X : లావా ప్రోవాచ్​ ఎక్స్​ లాంచ్..​ ఇన్- బిల్ట్​​ జీపీఎస్​ సహా మరెన్నో కూల్​ ఫీచర్స్​!-lava prowatch x with 1 43 inch amoled display in built gps launched in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Prowatch X : లావా ప్రోవాచ్​ ఎక్స్​ లాంచ్..​ ఇన్- బిల్ట్​​ జీపీఎస్​ సహా మరెన్నో కూల్​ ఫీచర్స్​!

Prowatch X : లావా ప్రోవాచ్​ ఎక్స్​ లాంచ్..​ ఇన్- బిల్ట్​​ జీపీఎస్​ సహా మరెన్నో కూల్​ ఫీచర్స్​!

Sharath Chitturi HT Telugu
Published Feb 15, 2025 01:40 PM IST

లావా ప్రోవాచ్ ఎక్స్ పేరుతో ఒక కొత్త స్మార్ట్​వాచ్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఇందులో ఇన్​-బిల్ట్​ జీపీఎస్​తో పాటు మరెన్నో ఫీచర్స్​ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లావా ప్రోవాచ్​ ఎక్స్​ లాంచ్..​ ఎన్నో కూల్​ ఫీచర్స్​!
లావా ప్రోవాచ్​ ఎక్స్​ లాంచ్..​ ఎన్నో కూల్​ ఫీచర్స్​!

లావా సబ్ బ్రాండ్ అయిన “ప్రోవాచ్”.. తన తొలి ఎక్స్-సిరీస్ స్మార్ట్​వాచ్​ని తాజాలా లాంచ్​ చేసిది. దీని పేరు ప్రోవాచ్​ ఎక్స్​. ఇందులో ఇన్ -బిల్ట్ జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్​ సహా మరెన్నో కూల్​ ఫీచర్స్​ ఉన్నాయి. రూ.5,000 లోపు బడ్జెట్​లో హెల్త్ ట్రాకింగ్, నావిగేషన్, యాక్టివిటీ మానిటరింగ్ వంటి ఫీచర్స్​తో ఒక మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారు ప్రోవాచ్​ ఎక్స్​ కొనుగోలు చేయాలని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లావా ప్రోవాచ్ ఎక్స్- స్పెసిఫికేషన్లు..

లావా ప్రోవాచ్ ఎక్స్​లో 1.43 ఇంచ్​ 30 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 466×466 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్​నెస్ వంటివి ఉన్నాయి. ఈ వాచ్ ఆల్వేస్-ఆన్-డిస్​ప్లే (ఏఓడీ) పనితీరును కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ఈ గ్యాడ్జెట్​కి ప్రొటెక్షన్​ లభిస్తుంది. ఈ వాచ్ 150కి పైగా వాచ్​ఫేస్ లతో వస్తుంది. ఇవి సందర్భానికి అనుగుణంగా క్లాక్​ రూపాన్ని కస్టమైజ్ చేయడానికి ఉపయోగపడతాయి.

ఈ ప్రోవాచ్​ ఎక్స్​ స్మార్ట్​వాచ్​ డ్యూయెల్ కోర్ అడ్వాన్స్​డ్​ యాక్షన్స్ ATD3085C చిప్​సెట్​తో పనిచేస్తుంది. ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుందని సంస్థ చెబుతోంది. బ్లూటూత్ వర్షెన్ 5.3తో వచ్చిన ఈ వాచ్.. కాల్స్ చేయడానికి ఇన్ బిల్ట్ డయలర్​ను సపోర్ట్ చేస్తుంది!

కచ్చితమైన హార్ట్​ రేట్​, ఎస్​పీఓ2 రీడింగ్స్​ కోసం ఈ వాచ్​లో హెచ్​ఎక్స్​3960 పీపీజీ సెన్సార్​ని ఫిక్స్​ చేసింది సంస్థ. ఇతర ట్రాకింగ్ మెట్రిక్స్ పరంగా, ప్రోవాచ్​ ఎక్స్​ హై ఇంటెన్స్​ వ్యాయామాల కోసం వివోఎక్స్ మ్యాక్స్ ట్రాకింగ్, రోజంతా ఎనర్జ లెవల్స్​ని ట్రాక్​ చేసేందుకు బాడీ ఎనర్జీ మీటర్​ వంటివి ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటరింగ్, ఫైండ్ మై ఫోన్, ఉమెన్స్ హెల్త్ ట్రాకింగ్, ఈవెంట్ రిమైండర్స్, పోమోడోరో టైమర్, బారోమీటర్, కంపాస్, ఆల్టిమీటర్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ స్మార్ట్​వాచ్​ సొంతం.

హైకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, యోగా, పిలేట్స్ శిక్షణతో సహా ఇండోర్- ఔట్​డోర్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి లావా లేటెస్ట్​ వాచ్ 110+ కస్టమైజబుల్ స్పోర్ట్స్ మోడ్స్​ని సైతం కలిగి ఉంది.

ఇది ఐపీ68 సర్టిఫైడ్. అంటే ఇది నీటిలో 1.5 మీటర్లు మునిగిపోయినా, 30 నిమిషాల వరకు తట్టుకోగలదు. 300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ వాచ్ 8-10 రోజుల బ్యాటరీ లైఫ్​ను అందిస్తుంది.

లావా ప్రోవాచ్ ఎక్స్ ధర..

లావా ప్రోవాచ్​ ధర రూ.4,499. ఫిబ్రవరి 21, 2025 నుంచి ఫ్లిప్​కార్ట్​లో కొనుగోలు చేయవచ్చు. రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్​తో ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 18 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం