Smart Phone : రూ.13,999కే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్!-lava blaze x 5g discount buy this 5g smart phone with huge discount check specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Phone : రూ.13,999కే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్!

Smart Phone : రూ.13,999కే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు కూడా అదుర్స్!

Anand Sai HT Telugu

Lava Blaze X 5G Discount : లావా ఫోన్లు ఒకప్పుడు మార్కెట్‌ను ఊపేశాయి. అయితే ఆ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వెరియంట్లతో ఫోన్లను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ లావా బ్లేజ్ ఎక్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది.

లావా బ్లేజ్ ఎక్ ఫోన్ మీద డిస్కౌంట్

తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునేవారికి శుభవార్త. లావా కంపెనీ చౌకగా మంచి ఫీచర్లతో ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో కర్వ్డ్ డిస్‌ప్లేతో 5జీ ఫోన్ కొనుక్కోవచ్చు. అది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. జూలై 10న కంపెనీ దీనిని భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్ రూ.14 వేల లోపు ధరకు లభిస్తుంది.

కర్వ్ డ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తున్న ఈ సెగ్మెంట్‌లో ఇదే తొలి 5జీ ఫోన్ అని కంపెనీ తెలిపింది. మంచి విషయం ఏమిటంటే, ఈ ఫోన్ చౌకగా ఉన్నప్పటికీ, భారీ ర్యామ్, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్‌‌తో మంచి బ్యాటరీ వస్తుంది. మొదటి సేల్‌లో ఈ ఫోన్ ఎంత చౌకగా లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

మూడు వేరియంట్స్

లావా బ్లేజ్ ఎక్స్ స్టార్ లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ర్యామ్ ప్రకారం, ఈ ఫోన్ మూడు విభిన్న ఎంపికలలో వస్తుంది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గానూ నిర్ణయించారు. ఈ మూడు వేరియంట్లలో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

బ్యాంక్ కార్డు ద్వారా తగ్గింపు

కస్టమర్లు ఏదైనా బ్యాంక్ కార్డును ద్వారా రూ .1000 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ తర్వాత ఫోన్ 4 జీబీ వేరియంట్ ధర రూ.13,999, 6 జీబీ వేరియంట్ ధర రూ.14,999, 8 జీబీ మోడల్ ధర రూ.15,999గా వస్తుంది. ఇది లావా ఇ-స్టోర్, అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీ వివరాలు చూద్దాం..

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫీచర్స్

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మెరుగైన వీక్షణ క్వాలిటీ కోసం హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్, LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.

64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సోనీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5జీ, డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/గ్లోనాస్/బీడో వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. టైప్-సి పోర్ట్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది వాటర్ ప్రూఫ్ కోసం ఐపి 52 రేటింగ్ పొందింది. 'ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్' కార్యక్రమంతో కస్టమర్ అనుభవంపై కూడా లావా దృష్టి సారించింది.