64 ఎంపీ కెమెరాతో లావా కొత్త ఫోన్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!-lava blaze amoled 5g featuring 3d curved edge amoled display 64mp camera launched in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  64 ఎంపీ కెమెరాతో లావా కొత్త ఫోన్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

64 ఎంపీ కెమెరాతో లావా కొత్త ఫోన్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Anand Sai HT Telugu

లావా బ్లేజ్ అమోఎల్ఈడీ 5జీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్డ్ ఎడ్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్.

లావా నుంచి కొత్త ఫోన్

లావా తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ పేరు లావా బ్లేజ్ అమోఎల్ఈడీ 5జీ. అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్లలో ఇది ఒకటి. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ మూడు ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీ వరకు ఉంటుంది. దీంతోపాటు 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వంటి అనేక గొప్ప ఫీచర్లను కూడా ఈ ఫోన్ అందిస్తోంది.

ఈ ఫోన్ ధర, అమ్మకం తేదీ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను లిస్ట్ చేశారు. దీని అమ్మకాలు త్వరలోనే భారత్‌లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. లావాకు చెందిన ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

లావా బ్లేజ్ ఫీచర్లు

ఈ ఫోన్ లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ 3డీ కర్వ్డ్ ఎడ్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందిస్తున్నారు. ఫోన్‌లో అందించే ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా చూడొచ్చు.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెండు కెమెరాలను అందిస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాటరీ 5000 ఎంఏహెచ్ గా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లు

బయోమెట్రిక్ భద్రత కోసం ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యుయల్ సిమ్ 5జీ, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. లావా ఈ ఫోన్‌ను టైటానియం గ్రే, స్టార్ లైట్ పర్పుల్ రంగుల్లో విడుదల చేసింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.