Lava Blaze 5G Sale: చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు.. ఇంట్రడక్టరీ ధరతో..-lava blaze 5g phone goes on sale in india with introductory price rs 9999 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Lava Blaze 5g Phone Goes On Sale In India With Introductory Price Rs 9999

Lava Blaze 5G Sale: చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు.. ఇంట్రడక్టరీ ధరతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2022 02:54 PM IST

Lava Blaze 5G Sale: దేశీయ కంపెనీ లావా తీసుకొచ్చిన చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ తొలిసారి సేల్‍కు వచ్చింది. ప్రస్తుతం ఇంట్రడక్టరీ ఆఫర్ ధరకు లభిస్తోంది. పూర్తి వివరాలు ఇవే.

Lava Blaze 5G Sale: చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు.. ఇంట్రడక్టరీ ధరతో.. (Photo: Lava)
Lava Blaze 5G Sale: చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలు.. ఇంట్రడక్టరీ ధరతో.. (Photo: Lava)

Lava Blaze 5G Sale: లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ నేడు (నవంబర్ 15) తొలిసారి సేల్‍కు వచ్చింది. ఇండియాలో ప్రస్తుతం ఇదే అత్యంత చౌకై న 5జీ మొబైల్‍గా ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఈ బడ్జెట్ 5జీ ఫోన్ కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్‍సీడీ డిస్‍ప్లేతో వస్తోంది. ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, 128జీబీ స్టోరేజ్‍ను కలిగి ఉంది. లావా బ్లేజ్ 5జీ ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్‍ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Lava Blaze 5G Price, Sale: లావా బ్లేజ్ 5జీ ధర, సేల్

4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న లావా బ్లేజ్ 5జీ సాధారణ ధర రూ.10,999 కాగా.. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.9,999కే సేల్‍కు వచ్చింది. అంటే రూ.10వేలలోపే ఈ 5జీ స్మార్ట్ ఫోన్‍ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఇంట్రడక్టరీ ఆఫర్ ధర ఎంత కాలం ఉంటుందో లావా స్పష్టంగా వెల్లడించలేదు. లావా అధికారిక వెబ్‍సైట్‍ (lavamobiles.com) తో పాటు ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍ (Amazon) లో లావా బ్లేజ్ 5జీ ఫోన్ నేడు (నవంబర్ 15) సేల్‍కు వచ్చింది. గ్లాస్ బ్లూ, గ్లాస్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది. ప్రస్తుతం కొన్ని యూనిట్లే సేల్‍కు వచ్చే అవకాశం ఉంది.

Lava Blaze 5G Specifications, features: లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్లు

  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.51 హెచ్‍డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‍ప్లేతో లావా బ్లేజ్ 5జీ వస్తోంది.
  • ఈ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍ను కలిగి ఉంది.
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజీ సాయంతో 3జీబీ వరకు వర్చువల్‍ ర్యామ్‍ పొడిగించుకోవచ్చు.
  • లావా బ్లేజ్ 5జీ ఫోన్ మూడు వెనుక కెమెరాలతో వస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరో రెండు కెమెరాలు ఉంటాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో లావా బ్లేజ్ 5జీ మొబైల్ వస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను లావా ఇచ్చింది.

WhatsApp channel

టాపిక్