Honor Pad X9a : హానర్​ కొత్త ట్యాబ్లెట్​ లాంచ్​- ప్యాడ్​ ఎక్స్​9ఏ ఎలా ఉందంటే..-latest tech news honor pad x9a launched check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honor Pad X9a : హానర్​ కొత్త ట్యాబ్లెట్​ లాంచ్​- ప్యాడ్​ ఎక్స్​9ఏ ఎలా ఉందంటే..

Honor Pad X9a : హానర్​ కొత్త ట్యాబ్లెట్​ లాంచ్​- ప్యాడ్​ ఎక్స్​9ఏ ఎలా ఉందంటే..

Sharath Chitturi HT Telugu

Honor Pad X9a : హానర్​ కొత్త ట్యాబ్లెట్​ని లాంచ్​ చేసింది. దీని పేరు హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ. ఈ మోడల్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ (@honor)

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. కంపెనీ లేటెస్ట్​ ట్యాబ్లెట్​లో 11.5 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంది. ఈ గ్యాడ్జెట్​ స్నాప్​డ్రాగన్​ 685 చిప్​తో పనిచేస్తుంది. అంతేకాదు ఇది 8,300 ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తోంది. ఈ నేపథ్యంలో హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ..

సరికొత్త హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏలో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 11.5 ఇంచ్​ 2.5కే రిజొల్యూషన్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది.

ఫొటొగ్రఫీ కోసం హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ ట్యాబ్​లో ఆటో ఫోకస్​తో కూడిన 8 ఎంజీ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉంది.

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏలో 8జీబీ ర్యామ్​ ఉంది. 128జీబీ వరకు స్టోరేజ్​ ఆప్షన్​ వస్తోంది. వైఫై, బ్లూటూత్​ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. ఆండ్రాయిడ్​ 15 ఆధారిత మ్యాజిక్​ఓఎస్​ 9.0పై ఇది పనిచేస్తుంది.

ఈ కొత్త ట్యాబ్​లో క్వాడ్​ స్పీకర్​ సెటప్​ ఉంది. 8,300ఎంఏహెచ్​ లిథియం- ఐయన్​ బ్యాటరీని 35వాట్​ ఛార్జర్​తో ఛార్జ్​ చేయవచ్చు. స్టాండ్​బై మోడ్​లో ఈ గ్యాడ్జెట్ బ్యాటరీ లైఫ్​​ 70రోజులు అని సంస్థ చెబుతోంది.

ఈ హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ బరువు 475 గ్రాములు. మెజర్మెంట్స్​.. 267.3x167x6.77ఎంఎం.

హానర్​ ప్యాడ్​ ఎక్స్​9ఏ- ధర..

ఈ హానర్​ కొత్త ప్యాడ్​ మలేషియాలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో గ్రే కలర్​ ఆప్షన్​ మాత్రమే ఉంది. హానర్​ మలేషియా వెబ్​సైట్​లో ఈ గ్యాడ్జెట్​ లిస్ట్​ అయ్యింది కానీ.. ధరను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.

మరి ఈ మోడల్​ ఇండియాలో లాంచ్​ అవుతుందో లేదో చూడాలి. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది.

హానర్​ ప్యాడ్​ వీ9..

ఈ నెల మొదట్లో జరిగిన హానర్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2025లో రెండు కొత్త పరికరాలను ప్రవేశపెట్టింది సంస్థ. వాటిలలో ఒకటి హానర్​ ప్యాడ్ వీ9.

ఇందులో 11.5 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే, 2800 × 1840 రిజల్యూషన్, 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, హెచ్​డీఆర్ వివిడ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ప్యానెల్ 500 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్, 274 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది.

10,100 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ సెల్ బ్యాటరీ సెటప్​ 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ మందం 6.1 మిల్లీమీటర్లు, బరువు 475 గ్రాములుగా ఉంది. మెరుగైన ఆడియో అవుట్​పుట్ కోసం ఇందులో ఎనిమిది స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2 ఉన్నాయి.

హానర్ ప్యాడ్ వీ9 ధర 449.90 యూరోలు (సుమారు రూ.40,000). యూరప్, యూకెలో లభిస్తుంది. త్వరలోనే భారత్ సహా ఇతర ప్రాంతాల్లోనూ లాంచ్ కానుంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం