boAt New Smartwatch: బడ్జెట్ రేంజ్‍లో బోట్ నుంచి మరో స్మార్ట్‌వాచ్.. ఇంట్రడక్టరీ ధరతో రేపే సేల్-latest boat wave leap call smartwatch launched price specifications features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Latest Boat Wave Leap Call Smartwatch Launched Price Specifications Features

boAt New Smartwatch: బడ్జెట్ రేంజ్‍లో బోట్ నుంచి మరో స్మార్ట్‌వాచ్.. ఇంట్రడక్టరీ ధరతో రేపే సేల్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2023 09:47 AM IST

boAt Wave Leap Call Smartwatch: బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఇంట్రడక్టరీ ధరతో రేపు (మార్చి 20) సేల్‍కు రానుంది.

boAt New Smartwatch: బడ్జెట్ రేంజ్‍లో బోట్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ (Photo: boAt)
boAt New Smartwatch: బడ్జెట్ రేంజ్‍లో బోట్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ (Photo: boAt)

boAt Wave Leap Call Smartwatch: స్మార్ట్‌వాచ్‍ల విషయంలో పాపులర్ బ్రాండ్ బోట్ (boAt) మరింత స్పీడ్ పెంచింది. వేవ్ సిరీస్‍లో మరో స్మార్ట్‌వాచ్‍(New Smartwatch)ను తీసుకొచ్చింది. బోట్ వేవ్ లీప్ కాల్ (boAt Wave Leap Call) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ వాచ్‍కు హైలైట్‍గా ఉంది. 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉన్న స్క్వేర్ షేప్ డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

boAt Wave Leap Call Smartwatch: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. ఈ వాచ్‍లో 20 వరకు కాంటాక్టులను సేల్ చేసుకోవచ్చు. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు. కాల్స్ ఆన్సర్ చేసి మాట్లాడవచ్చు.

boAt Wave Leap Call Smartwatch: 240x280 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.83 ఇంచుల స్క్వేర్ షేప్డ్ టచ్ డిస్‍ప్లేతో వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. ఈ డిస్‍ప్లేపై 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. మెటల్ బాడీని ఈ వాచ్ కలిగి ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్లు ఉంటాయి.

boAt Wave Leap Call Smartwatch: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్‍తో వాడితే 3 రోజుల వరకు వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీల కోసం 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే చూడొచ్చు.

బోట్ వేవ్ లీప్ కాల్ ధర, సేల్

boAt Wave Leap Call price: బోట్ వేవ్ లీప్ కాల్ స్మార్ట్‌వాచ్ సాధారణ ధర రూ.2,199 కాగా.. అమెజాన్‍లో రేపు (మార్చి 20) రూ.1,499 ఇంట్రడక్టరీ ధరకు సేల్‍కు రానుంది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధర ఎంత కాలం ఉంటుందో బోట్ పేర్కొనలేదు. డీప్ బ్లూ, చెర్రీ బ్లాసమ్, యాక్టివ్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో వేవ్ లీప్ కాల్ వాచ్ అందుబాటులోకి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం