ITR filing last date : 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలకు నేడే చివరి రోజు. గడువు ముగిసేలోపు.. పన్ను చెల్లింపులు దారులు కచ్చితంగా ఐటీఆర్‌ని ఫైల్ చేసుకోవాలని ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.
"పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి. 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగ్‌కి డిసెంబర్ 31 చివరి గడువు. డ్యూ డేట్‌కి ముందే మీ ఐటీఆర్‌ని ఫైల్ చేసుకోండి," అని ఓ నోటిఫికేషన్ని విడుదల చేసింది ఐటీశాఖ.
Income tax filing last date 2023 : ఎవరైతే ఇంకా ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేసుకోలేదో లేదా తప్పులను సరి చేసుకోవడం మర్చిపోయారో.. వారందరికి తిరిగి ఫైల్ చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లభించింది. ఇక ఆదివారం తో ఆ గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు త్వరపడటం మంచిది.
అయితే.. 2022 ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం గత ఐటీఆర్‌లను సబ్మీట్ చేయకపోతే.. అప్డేటెడ్ ఐటీఆర్‌లను ఫైల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు ఆదాయపు పన్నుశాఖ ఎలాంటి ఛార్జీలు, పెనాల్టీలు వసూలు చేయదు. అయితే.. ఎవరైతే అదనపు ఆదాయాన్ని డిక్లేర్ చేస్తున్నారో, ఎవరైతే ఆదాయం అడ్జెస్ట్మెంట్స్ చూపిస్తున్నారో.. వారికి ఛార్జీలు, పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఐటీఆర్‌లోని తప్పులను సరిచేసుకోకపోయినా పెనాల్టీలు పడొచ్చు.
Income tax filing 2023 news : మరోవైపు వార్షిక మొత్తం ఆదాయం రూ. 50లక్షలు (అసెస్మెంట్ ఇయర్) దాటే వారి ఐటీ రిటర్నుల ఫైలింగ్ కోసం ఉపయోగపడే ఫామ్ 1,4 నోటిఫికేషన్ని ఐటీశాఖ విడుదల చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియ ప్రతియేటా మార్చ్, ఏప్రిల్‌లో జరుగుతుంది. కానీ ఈసారి.. ముందే, అంటే డిసెంబర్లోనే జరిగింది.
ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెక్షన్ 234ఎఫ్ కింద బిలేటెడ్ రిటర్నులు ఫైల్ చేస్తున్న వారికి గరిష్ఠంగా రూ. 5వేల వరకు ఫైన్ పడొచ్చు. కాగా.. వార్షిక ఆదాయం రూ. 5లక్షల కన్నా తక్కువ ఉన్న వారికి రూ. 1000 పడుతుంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం నాటికి.. ఐటీఆర్‌లు దాఖలు చేసుకుంటో మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం