Large-cap stock declares 850 rupees dividend: రూ. 850 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ-largecap stock declares 850 rupees per share dividend pat rises 65 in q2 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Large-cap Stock Declares 850 Rupees Per Share Dividend, Pat Rises 65% In Q2

Large-cap stock declares 850 rupees dividend: రూ. 850 డివిడెండ్ ఇస్తున్న కంపెనీ

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 06:11 PM IST

Large-cap stock declares 850 rupees dividend: ఒక్కో షేరుకు 850 రూపాయల డివిడెండ్ ఇస్తున్న కంపెనీ ఇది. లార్జ్ క్యాప్ కంపెనీల్లో అత్యధిక డివిడెండ్ ఇస్తున్న సంస్థగా రికార్డు సృష్టిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Large-cap stock declares 850 rupees dividend: 3 ఎం ఇండియా లిమిటెడ్(3M India Ltd) ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ విలువ రూ. 26,442.16 కోట్లు. ఈ సంస్థ వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Large-cap stock declares 850 rupees dividend: విభిన్న రంగాల్లో వ్యాపారం

ఆటోమోటివ్స్, కమర్షియల్ సొల్యూషన్స్, కమ్యూనికేషన్స్, కన్సూమర్ గూడ్స్, డిజైన్ అండ్ కన్ స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, హెల్త్ కేర్, మ్యానుఫాక్చరింగ్, సేఫ్టీ, ట్రాన్స్ పోర్టేషన్.. ఇవి 3M India Ltd కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపార రంగాలు. ఈ సంస్థ బుధవారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో సంవత్సర(Q2FY23) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Large-cap stock declares 850 rupees dividend: రూ. 850 మధ్యంతర ప్రత్యేక డివిడెండ్

Q ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు సంస్థ శుభవార్త తెలిపింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్క షేరుపై రూ. 850 ల మధ్యంతర ప్రత్యేక డివిడెండ్(Interim Special Dividend) ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి రికార్డు డేట్ గా నవంబర్ 22ని నిర్ణయించింది. డివిడెండ్ మొత్తాన్ని డిసెంబర్ 9 లోగా మదుపర్ల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఈ సంస్థకు ప్రస్తుతం ఉన్నరూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ల సంఖ్య 1,12,65,070.

Large-cap stock declares 850 rupees dividend: 65% పెరిగిన నికర లాభాలు

ఈ Q2 లో 3M India Ltd రూ. 106.23 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత సంవత్సరం Q2 కన్నా 65.44% ఎక్కువ. గత సంవత్సరం Q2 లో సంస్థ రూ. 64.21 కోట్ల లాభాలను పొందింది. అలాగా ఈ Q1లో సంస్థ రూ. 84.25 కోట్ల లాభాలను సాధించింది. అలాగే ఈ Q2లో సంస్థ నికర అమ్మకాలు 16.25% పెరిగి, రూ. 976.70 కోట్లకు చేరాయి . ఇది గత సంవత్సరం Q2లో రూ. 840.10 కోట్లు మాత్రమే.

Large-cap stock declares 850 rupees dividend: షేర్ వాల్యూ

3M India Ltd షేరు విలువ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 23,480గా ఉంది. ఇది అంతకుముందు రోజు నాటి క్లోజింగ్ అయిన రూ. 22,400 కన్నా 4.82% ఎక్కువ.

WhatsApp channel