L and T chairman: ‘ఎంత సేపని భార్య ముఖం చూస్తారు? ఆదివారాలు కూడా పని చేయండి’- ఎల్ అండ్ టీ చైర్మన్ కామెంట్స్-l and t chairman sn subrahmanyan calls for working sundays netizens fume ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  L And T Chairman: ‘ఎంత సేపని భార్య ముఖం చూస్తారు? ఆదివారాలు కూడా పని చేయండి’- ఎల్ అండ్ టీ చైర్మన్ కామెంట్స్

L and T chairman: ‘ఎంత సేపని భార్య ముఖం చూస్తారు? ఆదివారాలు కూడా పని చేయండి’- ఎల్ అండ్ టీ చైర్మన్ కామెంట్స్

Sudarshan V HT Telugu
Jan 09, 2025 05:57 PM IST

L and T chairman: ఆదివారాలు కూడా ఉద్యోగులు ఇంట్లో భార్య ముఖం చూస్తూ కూర్చోకుండా, ఆఫీస్ కు వచ్చి పని చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్ లో పెద్ద చర్చకు దారితీశాయి.

ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్
ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్

L and T chairman: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ పై ఆయన చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆదివారాలు ఇంట్లో కూర్చోకుండా, ఆఫీస్ కు వచ్చి పని చేయాలని ఆయన చేసిన కామెంట్ ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

yearly horoscope entry point

రెడిట్ పోస్ట్ పై రగడ

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడిట్ లో ఎల్ అండ్ టీ (L&T) చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. "నేను మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయించలేకపోయినందుకు చింతిస్తున్నాను. నేను మిమ్మల్ని ఆదివారం పని చేయించగలిగితే, నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారం పని చేస్తాను. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? మీరు మీ భార్యను ఎంతసేపని చూస్తారు? లేదా మీ భార్య ఎంత సేపని మీ వైపు చూస్తుంది? ఆదివారం కూడా ఆఫీసుకి వెళ్ళి పని మొదలు పెట్టండి" అని ఎల్ అండ్ టీ చైర్మన్ ఆ పోస్ట్ లో రాశారు.

వారానికి 90 గంటలు..

90 గంటల పని కారణంగా చైనా అమెరికాను అధిగమించగలదని ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల ఒక చైనీస్ వ్యక్తితో జరిపిన సంభాషణను పంచుకున్నారు. అమెరికా వారానికి 50 గంటలు పనిచేస్తుంటే, చైనా వారానికి 90 గంటలు పనిచేస్తుందని చైనా వ్యక్తి వివరించారు. "అంటే మీకూ అదే సమాధానం. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే.. వారానికి 90 గంటలు పనిచేయాలి. కమాన్ బాయ్స్. రండి" అని సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు.

నెటిజన్ల ఆగ్రహం

ఆదివారం పని గురించి ఎస్ ఎన్ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్తున్నారు. ఆయన అభిప్రాయాలతో చాలా మంది విభేదించారు. "ఉద్యోగులు కంప్యూటర్ స్క్రీన్ ల వైపు ఎంతసేపు చూడగలరు" అని ఒక యూజర్ ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని సుబ్రమణ్యన్ పై మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘అతడి వైవాహిక జీవితం బాగాలేక, మొత్తం కంపెనీలోని ఉద్యోగులను శిక్షించాలనుకుంటున్నాడు" అని మరొక నెటిజన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 'ఆదివారం పనిచేస్తే ఫర్వాలేదు. కానీ మీరు మీ కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే." అని మరో యూజర్ కామెంట్ చేశాడు. 'తనకు ప్రేమపూర్వకమైన కుటుంబం లేదని చెప్పడానికి ఇదొక మార్గం' అని ఇంకో నెటిజన్ మండిపడ్డాడు.

Whats_app_banner