KTM RC 125 vs Suzuki Gixxer SF 250 : కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250.. ది బెస్ట్​ ఏది?-ktm rc 125 vs suzuki gixxer sf 250 check detailed comparison and price details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ktm Rc 125 Vs Suzuki Gixxer Sf 250 : కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250.. ది బెస్ట్​ ఏది?

KTM RC 125 vs Suzuki Gixxer SF 250 : కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250.. ది బెస్ట్​ ఏది?

Sharath Chitturi HT Telugu
Feb 12, 2023 07:36 AM IST

KTM RC 125 vs Suzuki Gixxer SF 250 : కేటీఎం ఆర్​సీ 125, సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250లో ది బెస్ట్​ ఏది? ఏది తీసుకోవాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250.. ది బెస్ట్​ ఏది?
కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250.. ది బెస్ట్​ ఏది? (HT AUTO)

KTM RC 125 vs Suzuki Gixxer SF 250 : బైక్స్​.. బైక్స్​.. బైక్స్​.. మార్కెట్​లో వివిధ మోటర్​సైకిల్స్​పై యువతలో మంచి క్రేజ్​ ఉంది. అందుకు తగ్గట్టుగానో ఆటో సంస్థలు సైతం లేటెస్ట్​ అప్డేట్స్​, మోడల్స్​ను ప్రవేశపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఏ బైక్​ తీసుకోవాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక ఇప్పుడు కేటీఎం ఆర్​సీ 125, సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250 బైక్స్​ని పోల్చి.. ఈ రెండిట్లో ది బెస్ట్​ ఏది? అన్నది తెలుసుకుందాము..

కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250- లుక్స్​..

KTM RC 125 n road price Hyderabad : లుక్స్​ పరంగా.. కేటీఎం ఆర్​సీ 125 అనేది ఆర్​సీ 390కి చిన్న వర్షెన్​లాగా ఉంటుంది. మొదటిసారి చూస్తే.. ఈ రెండిటి మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించదు. ఆరెంజ్​ పెయింట్​ స్కీమ్​ హైలైట్​గా నిలుస్తింది. లుక్​ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

Honda Activa 125 vs Suzuki Access 125 : హోండా యాక్టివా వర్సెస్​ సుజుకీ ఏసెస్​.. ది బెస్ట్​ ఏది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250.. జిక్సర్​ ఎస్​ఎఫ్​కు చిన్న వర్షెన్​లా ఉంటుంది. ఇటీవలే ఈ బైక్​కి కొత్త పెయింట్​ స్కీమ్స్​ వచ్చాయి. వీటిల్లో మాట్​ ఫినిష్​ హైలైట్​గా ఉంది.

కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250- స్పెసిఫికేషన్స్​..

KTM RC 125 features : కేటీఎం ఆర్​సీ 125లో 124.99సీసీ లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 14.69 బీహెచ్​పీ పవర్​ను, 12 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

ఇక సుజుకీ జిక్సర్​ ఎస్​ఎఫ్​ 250లో 249 సీసీ, ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 26.13 బీహెచ్​పీ పవర్​ను, 22.2 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులోనూ 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250- ఫీచర్స్​..

కేటీఎం ఆర్​సీ 125లో ఎల్​సీడీ డిస్​ప్లే, ఎల్​ఈడీ టెయిల్ ​ల్యాంప్​, టర్న్​ ఇండికేటర్స్​, సూపర్​మోటో ఏబీఎస్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

Hero Xoom vs Honda Activa: ఈ రెండు స్కూటర్లు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏది బెస్ట్! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Suzuki Gixxer SF 250 features : మరోవైపు సుజుకీ జిక్సర్​ 250 ఇటీవలే అప్డేట్​ అయ్యింది. ఇందులో బ్లూటూత్​ ఎనెబుల్డ్​ డిజిటల్​ కన్సోల్​, సుజుకీ ఈజీ స్టార్ట్​ సిస్టెమ్​, ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, టెయిల్​ ల్యాంప్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

కేటీఎం ఆర్​సీ 125 వర్సెస్​ జిక్సర్​ ఎస్​ఎఫ్ 250- ధర..

Suzuki Gixxer SF 250 on road price : కేటీఎం ఆర్​సీ 125 ధర రూ. 1.87లక్షలుగా ఉంది. ఇక సుజుకీ జిక్సర్​ 250 ధర రూ. 1.93లక్షలుగా ఉంది. రేసింగ్​ లివెరి డిజైన్​ కావాలనుకుంటే.. జిక్సర్​ 250కి మరో రూ. 9,600 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

Whats_app_banner