KTM Duke vs Bajaj Dominar: కేటీఎం డ్యూక్ వర్సెస్ బజాజ్ డోమినర్.. ఏ బైక్ బెస్ట్?
హెవీ సీసీ కేటగిరీలో పోటీ పడుతున్న బైక్స్ లో కేటీఎం 390 డ్యూక్ ఒకటి కాగా, బజాజ్ డోమినర్ 400 మరొకటి. ఈ రెండు బైక్ ల్లోనూ 373 సీసీ ఇంజిన్ లను అమర్చారు. ఇటీవలి కాలంలో బజాజ్ డోమినర్ ఇంజిన్ ను మరింత మెరుగుపర్చారు.
కేటీఎం 390 డ్యూక్, బజాజ్ డోమినర్ 400
హెవీ సీసీ కేటగిరీలో పోటీ పడుతున్న బైక్స్ లో కేటీఎం 390 డ్యూక్ ఒకటి కాగా, బజాజ్ డోమినర్ 400 మరొకటి. ఈ రెండు బైక్ ల్లోనూ 373 సీసీ ఇంజిన్ లను అమర్చారు. ఇటీవలి కాలంలో బజాజ్ డోమినర్ ఇంజిన్ ను మరింత మెరుగుపర్చారు.

రెండు బైక్ ల్లోనూ ఇంజన్ ఒకటే
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన నాటి నుంచి కేటీఎం డ్యూక్ 390 మంచి పర్ఫార్మెన్స్ తో దూసుకుపోతు, బజాజ్ డోమినర్ 400 తో పోటీ పడుతోంది. నిజానికి కేటీఎం, బజాజ్ ల మధ్య భాగస్వామ్య ఒప్పందం ఉంది. అందువల్ల డ్యూక్ 390 ఇంజన్ నే బజాజ్ డోమినర్ కు ఉపయోగిస్తారు. అంటే, రెండు బైక్ ల్లోని ఇంజన్ ఒకటే అన్నమాట. ఇంజన్ ను మినహాయిస్తే, రెండు బైక్ ల మధ్య చాలా తేడాలున్నాయి. అవేంటంటే..
డ్యూక్, డొమినర్ ల మధ్య తేడాలు
- డ్యూక్ 390 అగ్రెసివ్ లుకింగ్ స్ట్రీట్ ఫైటర్ లా ఉంటుంది. కేటీఎం బైక్ లు రోడ్లపై ఈజీగా గుర్తు పట్టేలా ఉంటాయి. డొమినర్ 400 బలిష్టమైన లుక్ తో పవర్ క్రూజర్ లా ఉంటుంది. ఫ్యుయెల్ ట్యాంక్ డిజైన్ కూడా మస్క్యులర్ లుక్ తో ఉంటుంది.
- రెండు బైక్ ల్లోనూ 373 సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. రెండింటిలనూ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కేటీఎం డ్యూక్ 9000 ఆర్పీఎం వద్ద 42. 90 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. బజాజ్ డొమినర్ 400 మాత్రం 8,800 ఆర్పీఎం వద్ద 39.45 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.బజాజ్ డొమినర్ లో ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ ఉంది.
- కేటీఎం 390 డ్యూక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, సూపర్ మొటో ఏబీఎస్, టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. బజాజ్ డొమినర్ లో విండ్ షీల్డ్, హ్యాండ్ గార్డ్స్, రియర్ లగేజ్ ర్యాక్, యూఎస్బీ పోర్ట్, రెండు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఉన్నాయి.
- రెండు బైక్ ల్లోనూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ లే ఉన్నాయి.
- కేటీెఎం డ్యూక్ 390 ఎక్స్ షో రూమ్ ధర రూ. 2.97 లక్షలు కాగా, బజాజ్ డొమినర్ 400 ఎక్స్ షో రూమ్ ధర రూ. 2.30 లక్షలు.
టాపిక్
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.