Best bike for youth : బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! ఈ బెస్ట్ సెల్లింగ్ కేటీఎం బైక్ ధర తగ్గింది..
బెస్ట్ సెల్లింగ్ కేటీఎం 390 డ్యూక్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి అప్డేట్! ఈ బైక్ ధరను తగ్గిస్తున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ధర ఎంత తగ్గింది? ఈ బైక్ ఫీచర్స్ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బైక్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! కేటీఎం 390 డ్యూక్ బైక్ ధరను సంస్థ తగ్గించింది. ఇప్పటివరకు రూ. 3.13 లక్షల ఎక్స్‌షోరూం ధరతో సేల్ అయిన ఈ మోడల్, ఇప్పుడు రూ. 2.95 లక్షలకు తగ్గింది. అంటే ఈ మోడల్‌పై రూ. 18వేలను సంస్థ తగ్గించింది.
కేటీఎం 390 డ్యూక్ వివరాలు..
ఈ కేటీఎం 390 డ్యూక్ బైక్ గతేడాది లాంచ్ అయింది. ఇది ఇన్స్టెంట్ హిట్ కొట్టింది! యువతలో ఈ బైక్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర మరింత తగ్గించడంతో సేల్స్ కూడా పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.
అంతేకాదు న్యూ జెన్ డ్యూక్ కోసం పర్ఫార్మెన్స్ని 373 సీసీ నుంచి 398 సీసీకి పెంచింది సంస్థ. ఇది ఇప్పుడు 44.25 బీహెచ్పీ పవర్‌ని, 39 Nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ కొనసాగుతోంది. ఇది చాలా సున్నితంగా పనిచేసే బై- డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.కేటీఎం 390 డ్యూక్‌లోని కొత్త ఫీచర్లు ఏంటి?
న్యూ జెన్ కేటీఎం 390 డ్యూక్‌కు అనేక కొత్త ఫీచర్లను జోడించింది సంస్థ. ఇది ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో 5-ఇంచ్ టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. ఇది మ్యూజిక్ కంట్రోల్, ఇన్‌కమింగ్ కాల్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ లాంచ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, కొత్త ట్రాక్ మోడ్, సూపర్‌మోటో ఏబీఎస్, క్విక్‌షిఫ్టర్, సెల్ఫ్-క్యాన్సిలింగ్ ఇండికేటర్లు, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్ ఫంక్షన్‌ను కూడా పొందుతుంది.
కేటీఎం 390 డ్యూక్ ఫ్రేమ్‌ను కూడా అప్‌డేట్ చేసింది సంస్థ. ఇది ఇప్పుడు కొత్త సబ్-ఫ్రేమ్‌తో కొత్త స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. వీటిని ప్రెషర్ డై-కాస్ట్ అల్యూమినియంతో తయారు చేశారు. దీనితో పాటు, కొత్త కర్వ్డ్ స్వింగ్‌ఆర్మ్ కూడా ఉంది. సస్పెన్షన్ కోసం ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి.
390 డ్యూక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆర్సీ 390 బైక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కొత్త, తేలికైన రొటార్లతో అమర్చి ఉంది. ముందు డిస్క్ 320 ఎంఎం, వెనుక డిస్క్ 240 ఎంఎం మెజర్మెంట్స్ కలిగి ఉంటుంది. అదనంగా, అల్యూమినియం చక్రాలు తేలికైనవిగా రూపొందించడం జరిగింది.
కేటీఎం 390 డ్యూక్ ప్రత్యర్థులు ఎవరు?
కేటీఎం 390 డ్యూక్ బైక్.. ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, యమహా ఎంటీ-03, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310లతో పోటీ పడుతుంది.
సంబంధిత కథనం