సింగిల్​ ఛార్జ్​తో 200 కి.మీ రేంజ్​- మిడల్​ క్లాస్​ వారికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పర్ఫెక్ట్​!-komaki se range of electric scooters launched check range price details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 200 కి.మీ రేంజ్​- మిడల్​ క్లాస్​ వారికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పర్ఫెక్ట్​!

సింగిల్​ ఛార్జ్​తో 200 కి.మీ రేంజ్​- మిడల్​ క్లాస్​ వారికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పర్ఫెక్ట్​!

Sharath Chitturi HT Telugu
Jan 21, 2025 06:56 AM IST

Komaki Electric scooters : భారతీయ మిడిల్​ క్లాస్​ వారి ముందుకు మరో మూడు ఎలక్ట్రిక్​ స్కూటర్లు వచ్చేశాయి. వీటిని స్టార్టప్​ సంస్థ కొమాకి ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​ చేసింది. ఈ మోడల్స్​ రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చెక్​ చేసేయండి..

కొమాకి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..
కొమాకి కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ సంస్థ కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్.. కొత్త సిరీస్​ని తీసుకొచ్చింది. దీని పేరు కోమాకి ఎస్ఈ. ఇందులో భాగంగా ఎస్ఈ ప్రో, ఎస్ఈ అల్ట్రా, ఎస్ఈ మ్యాక్స్ అనే మూడు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లను లాంచ్​ చేసింది. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ.67,999, రూ.76,999, రూ.1,10,000. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మూడు మోడల్స్​ని, గతంలో లాంచ్​ చేసిన కొమాాకి ఎంజీ ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆధారంగా సంస్థ నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే..

కొమాకి ఎస్ఈ అల్ట్రా, ఎస్ఈ మ్యాక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​​లో లిపో4 బ్యాటరీ టెక్నాలజీ హై కెపాసిటీ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ కొత్త టెక్నాలజీ మెరుగైన రేంజ్​ని అందిస్తుందని సంస్థ పేర్కొంది. కోమాకి ఎస్ఈ అల్ట్రా 2.7 కిలోవాట్ల లిపో4 బ్యాటరీని పొందుతుంది. దీని రేంజ్​ 130-140 కిలోమీటర్లు. కోమాకి ఎస్ఈ మ్యాక్స్ 4.2 కిలోవాట్ల లిపో4 బ్యాటరీని పొందుతుంది. దీని రేంజ్​ 200 కిలోమీటర్లు అని సంస్థ చెప్పింది.

రేంజ్​పై ఫోకస్​ చేసే మిడిల్​ క్లాస్​ ప్రజలకు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లు మంచి ఆప్షన్లు అవుతాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా కొమాకి ఎస్​ఈ ప్రో ఈ-స్కూటర్​ రేంజ్​ వివరాలు తెలియాల్సి ఉంది.

డ్యూయల్ ఛార్జర్లు, టీఎఫ్​టీ స్క్రీన్లు,డ్యూయల్ డిస్క్​లను ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లు కలిగి ఉన్నాయి. ఈ ఎస్​ఈ ప్రో, ఎస్​ఈ అల్ట్రా ఈ- స్కూటర్స్​లో సింగిల్ డిస్క్, ఎల్ఈడీ డిజిటల్ స్పీడోమీటర్ వంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ల టాప్​ స్పీడ్​, 70 కేఎంపీహెచ్​.

కోమాకి ఎంజీ ప్రో: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

కోమాకి ఎంజీ ప్రో 2024లో లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఎంజీ ప్రో లీ, ఎంజీ ప్రో వీ, ఎంజీ ప్రో +. తక్కువ-స్పీడ్ లీ వేరియంట్ 1.75 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్​ని పొందుతుంది. ఇది 75 కిలోమీటర్ల (క్లెయిమ్) పరిధిని అనుమతిస్తుంది. వీ.. 100 కిలోమీటర్ల (క్లెయిమ్ పరిధి) తో 2.2 కిలోవాట్ల బ్యాటరీని పొందుతుంది. ప్రో + వేరియంట్ 150 కిలోమీటర్ల (క్లెయిమ్) రేంజ్​తో 2.7 కిలోవాట్ల బ్యాటరీని పొందుతుంది. ఛార్జర్ 4- 5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​లో అధునాతన రెజెన్​తో కూడిన వైర్లెస్ కంట్రోలర్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మోటార్ అనేది బీఎల్​డీసీ హబ్ మౌంటెడ్ యూనిట్. ఈ స్కూటర్ డిజిటల్ మ్యాట్రిక్స్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​తో పాటు వైర్​లెస్​గా అప్డేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. లాక్ బై రిమోట్ ఫంక్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రిపేర్ స్విచ్, టెలిస్కోపిక్ షాకర్, సెల్ఫ్ డయాగ్నసిస్, యాంటీ థెఫ్ట్ లాక్, మొబైల్ ఛార్జింగ్ స్లాట్ వంటి కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఈ-స్కూటర్​లో ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం