Expensive Cars : భారత్‌లో అత్యంత ఖరీదైన కారు ఎవరిది? ఐదుగురిలో టాప్ 1 సౌత్ ఇండియా నుంచే!
Expensive Cars : భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఎవరికి ఉంది? ఈ ప్రశ్న వేసుకోగానే చాలా మంది ఎవరా ఆ సెలబ్రెటీ అనుకుంటారు. కొందరేమో ముఖేష్ అంబానీని గుర్తుచేసుకుంటారు. కానీ కాదు. భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న ఐదుగురు వ్యక్తుల గురించి చూద్దాం..
భారత ఆటోమెుబైల్ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ఈ రంగం పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతుంది. దానికి తగ్గట్టుగానే ఇండియాలో లగ్జరీ కార్లు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఖరీదైన లగ్జరీ కార్లను వాడేందుకు ఇష్పడుతున్నారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఎవరిది అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది ముఖేష్ అంబానీకి నెంబర్ 1 ప్లేస్ ఇస్తారు. అయితే కాదు.. దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దగ్గరే టాప్ మోడల్ కారు ఉంది.
నిజానికి ఇండియాలో అత్యధిక సంఖ్యలో లగ్జరీ కార్లు సేకరించేవారు ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన చాలా మంది వ్యక్తులు అనేక లగ్జరీ వాహనాలను కలిగి ఉన్నారు. ఇందులో భారతదేశంలోని టాప్ 5 ఖరీదైన లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం..
బెంట్లీ ముల్సాన్నే
బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ రెడ్డి. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారును కలిగి ఉన్నారు. బెంట్లీ ముల్సాన్నే ఈడబ్ల్యూబీ ఆయన దగ్గర ఉంది. ఈ వాహనం ఇంటీరియర్ డిజైన్‌తో చాలా భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయంగా అమ్మకానికి అందుబాటులో లేని ఈ మోడల్ ధర 14 కోట్లు(ఎక్స్ షోరూమ్).
రోల్స్ రాయిస్ ఫాంటసీ VIII
ముఖేష్ అంబానీకి చెందిన రోల్స్ రాయిస్ ఫాంటసీ VIII రూ.13.50 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ విలువైన రోల్స్ రాయిస్‌ను కలిగి ఉన్న ముఖేష్ అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్
ఈ జాబితాలో మూడో స్థానంలో నటుడు ఇమ్రాన్ హష్మీ ఉన్నారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఆయన దగ్గర ఉంది. ఈ కారు ధర రూ.12 కోట్లు 25 వేలు. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ ఇంజిన్ 600 పీఎస్ పవర్, 900 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారు గరిష్ట వేగం 250 కి.మీ. ఇది కాకుండా ఇమ్రాన్ హష్మీ వద్ద అనేక హై-ఎండ్ కార్ల కలెక్షన్ ఉంది.
మెక్‌లారెన్ 765ఎల్‌టీ
అత్యంత ఖరీదైన కారు ఉన్న వ్యక్తుల్లో నాలగో స్థానంలో హైదరాబాద్ వ్యాపారవేత్త నజీర్ ఖాన్ ఉన్నారు. ఈయనకు చెందిన మెక్‌లారెన్ 765ఎల్‌టీ స్పైడర్ కూడా అమేజింగ్ కారు. ఈ కారు ధర రూ.12 కోట్ల వరకు ఉంది. స్పోర్టీ లుక్‌తో రెడ్ షేడ్‌లో ఆకట్టుకునేలా ఉంటుంది.
మెర్సిడెజ్ బెంజ్ ఎస్680 గార్డ్
ముకేశ్ అంబానీకి చెందిన మరో వాహనం జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఈ కారు Mercedes-Benz-S680 గార్డ్. ఈ మోడల్ ధర రూ.10 కోట్లు వరకు ఉంటుంది. ముఖేష్ దగ్గర ఉన్న ఖరీదైన కార్లలో ఇది ఒకటి.