IT Notice : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపితే ఏం చేయాలి?-know what to do when you receive an income tax notice after filing itr check process here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  It Notice : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపితే ఏం చేయాలి?

IT Notice : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపితే ఏం చేయాలి?

Anand Sai HT Telugu
Aug 06, 2024 10:30 AM IST

Income Tax Notice After ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్ చేసిన తర్వాత కొందరికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకోవాలి. అప్పుడే ఐటీ శాఖ చర్యల నుంచి తప్పించుకోవచ్చు.

ఐటీ నోటీసులు
ఐటీ నోటీసులు

ఐటీఆర్ దాఖలు చేసే గడువు జూలై 31తో ముగిసింది. ఇప్పటి వరకు దాదాపు 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఈ కోట్లాది మంది పన్ను దాఖలు చేసినవారిలో ఆదాయపు పన్ను శాఖ తప్పు ITR ఫారమ్‌ను ఎంచుకోవడం ద్వారా లేదా అన్ని ఆదాయ వనరులను వెల్లడించకుండా ఐటీఆర్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులను కనిపెడుతుంది.

అటువంటివారికి మెయిల్ ద్వారా తప్పును తెలియజేస్తుంది. ఐటీఆర్ దాఖలు చేయకపోవడం, పన్ను చెల్లించకపోవడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం వంటి పలు సమస్యల కారణంగా నోటీసులు జారీ చేస్తారు. వివిధ ఆదాయపు పన్ను నోటీసుల వివరాలు, వాటికి ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిది.

ఐటీ నోటీసు

మీరు జీతం పొందే ఉద్యోగైతే, కంపెనీ మీ తరపున పన్ను తీసివేసి చెల్లిస్తే ITR ఫైల్ చేయడం తప్పనిసరి. కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు, పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు నుండి మినహాయింపు ఉంది. మీ కంపెనీ మీ జీతం నుండి టీడీఎస్‌ని తీసివేసినట్లయితే మీ జీతం ఐటీ చట్టాల కింద పేర్కొన్న ప్రాథమిక మినహాయింపు పరిమితుల కంటే ఎక్కువగా ఉందని అర్థం. ఐటీఆర్ ఫైల్ చేయడంలో వైఫల్యం మీకు ఆదాయపు పన్ను నోటీసు రావొచ్చు.

ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు సెక్షన్లు 139(9), 143(1), 143(2), 143(3), 245, 144, 147, 144తో సహా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని అనేక సెక్షన్ల కింద నోటీసులు అందుకుంటారు.

సరైన కారణం ఎంచుకోండి

మీ జీతం నుండి టీడీఎస్ తీసివేసినా ఐటీఆర్ తప్పనిసరిగా ఫైల్ చేయాలి. గడువులోగా దాఖలు చేసినట్లయితే ఆదాయ లెక్కింపు, పెట్టుబడి రుజువును సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత పన్ను ఎగవేత లేదని నిరూపించడానికి ఆదాయ లెక్కింపు, పెట్టుబడి రుజువు సమర్పించాలి. మెయిల్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయనట్లు మీకు నోటీసు వస్తే, మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు. మీ నోటిఫికేషన్‌ను కనుగొని, పోర్టల్‌లో పేర్కొన్న ఫైల్ చేయకపోవడానికి గల కారణాలలో ఒకదాన్ని ఎంచుకోండి.

ఫారం 26Aతో సరిపోల్చండి

మీ పన్ను మొత్తం, ఐటీఆర్‌లోని ఫారం 26AS సరిపోలకపోతే, మీకు ఐటీ నోటీసు వస్తుంది. టీడీఎస్, ఐటీఆర్‌కు వ్యతిరేకంగా ఫారమ్ 26ASలో పన్ను క్రెడిట్‌లను తనిఖీ చేయండి. ఏవైనా వ్యత్యాసాలను ఉంటే సరి చేయండి. తదనుగుణంగా మీ ఆదాయపు పన్ను వివరాలను అప్‌డేట్ చేయాలి. సవరించిన ITRని ఫైల్ చేయండి.

మీ మొత్తం ఆదాయాన్ని వెల్లడించనందుకు మీరు నోటీసు అందుకోవచ్చు. పన్ను శాఖ ఈ సమాచారాన్ని బ్యాంకు వడ్డీ, పన్ను మినహాయింపులు, వార్షిక సమాచార ప్రకటనల వంటి వివిధ విషయాల నుంచి కనుగొనవచ్చు. వివిధ వనరుల నుండి మీ ఆదాయాన్ని తనిఖీ చేసి.. దానిని ఫారమ్ 26ASతో సరిపోల్చండి. మీరు ఏవైనా ఆదాయ వివరాలను మిస్ అయితే మీ ఐటీఆర్‌ని అప్‌డేట్ చేసి ఫైల్ చేయండి.

నోటీసు వస్తే ఏం చేయాలి?

ఆదాయపు పన్ను నోటీసు అందుకున్న తర్వాత మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే దానిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం. ఆదాయపు పన్ను శాఖ, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేస్తుంది. ఒక్కో రకమైన నోటిఫికేషన్ ఒక్కో ప్రయోజనం కోసం పంపిస్తారు.

నోటీసులో పేరు, పాన్ నంబర్, అసెస్‌మెంట్ సంవత్సరాన్ని తనిఖీ చేయండి. నోటీసు మీకు సంబంధించినదని నిర్ధారించుకోండి. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో నోటీసును చెక్ చేయండి. నోటీసులోని సూచనలను అనుసరించండి, అవసరమైనవి చేయాల్సి ఉంటుంది.

టాపిక్