అండర్‌వేర్స్, కండోమ్స్, లిప్ స్టిక్, ద్రాక్షపండ్లు.. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఇవే-know what indians ordered on new year eve 2025 grapes underwears condoms lipstick ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అండర్‌వేర్స్, కండోమ్స్, లిప్ స్టిక్, ద్రాక్షపండ్లు.. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఇవే

అండర్‌వేర్స్, కండోమ్స్, లిప్ స్టిక్, ద్రాక్షపండ్లు.. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఇవే

Anand Sai HT Telugu
Jan 02, 2025 08:13 AM IST

New Year Orders Online : దేశంలో క్విక్ కామర్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దీనిని వినియోగదారులు కూడా బాగా వాడుకుంటున్నారు. న్యూ ఇయర్ లాంటి సందర్భాల్లో దీంటో ఆర్డర్లు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. 2025 కొత్త సంవత్సరం సందర్భంగా ఆర్డర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

క్విక్ కామర్స్ వచ్చాక జనాలు పెద్దగా బయటకు వెళ్లాల్సిన పని లేకుండా అయింది. ఇంట్లో కూర్చొని ఒక్క నొక్కు నొక్కితే కావాల్సింది ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఇక ఏదైనా పార్టీల సందర్భంగా ఎలాంటి తిప్పలు లేకుండా కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. పండుగల సందర్భంలో క్విక్ కామర్స్‌లో మంచి గిరాకీ టైమ్. వేడుకల కోసం చాలా మంది ఆర్డర్లు పెడుతుంటారు. అలాగే ఈసారి 2025 కొత్త సంవత్సరం సందర్భంగా ఊహించనివి కూడా జనాలు ఎక్కువగా ఆర్డర్ పెట్టారు.

yearly horoscope entry point

దేశంలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో ఆన్‌లైన్‌లో చాలా మంది అనేక రకాల వస్తువులను కూడా ఆర్డర్ చేశారు. బ్లింకిట్, స్విగ్గీ వంటి యాప్‌లలో అత్యధికంగా ఏది ఆర్డర్ అయిందో చూద్దాం.. కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఆన్‌లైన్ ఆర్డర్‌ల ద్వారా చాలా వస్తువులను ఆర్డర్ చేశారు. ఈ విషయాన్ని బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు స్వయంగా వెల్లడించారు. ఇందులో ద్రాక్ష నుండి కండోమ్‌ల వరకు ఉన్నాయి.

న్యూ ఇయర్ రాత్రి ఎక్కువగా ఆర్డర్ చేసినవాటి గురించి బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధింద్సా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. మంగళవారం ఉదయం నుండి అంటే డిసెంబర్ 31 నుంచి జనాలు ఎక్కువగా ద్రాక్షను ఆర్డర్ చేశారని చెప్పారు. సాధారణంగా ఆర్డర్ చేసే ద్రాక్షల కంటే నూతన సంవత్సర సందర్భంగా ఎక్కువ ఆర్డర్ వచ్చింది.

అల్బిందర్ ప్రకారం న్యూ ఇయర్ రాత్రి సమీపిస్తున్న కొద్దీ జనాలు ఎక్కువగా చిప్స్, సోడా ఆర్డర్ చేయడం ప్రారంభించారు. ఇది కాకుండా చాలా ఆలూ భుజియా, ఐస్ క్యూబ్స్, లిప్‌స్టిక్, లైటర్‌లు కూడా ఆర్డర్ అయ్యాయి.

'నూతన సంవత్సర పండుగ సందర్భంగా నేను అస్సలు ఊహించని విధంగా జరిగింది. పురుషుల లోదుస్తులను ఎక్కువగా ఆర్డర్ చేశారు.' అని అల్బిందర్ చెప్పారు.

ఇక కండోమ్స్ విషయానికి వస్తే.. బ్లింకిట్ ఒక్కటే 1,22,356 కండోమ్ ప్యాక్స్ డెలివరీ చేసింది. 2.34 లక్షల ఆలూ భుజియా, 45,531 మినరల్ వాటర్ బాటిల్స్, 6834 ఐస్ క్యూబ్స్, 1003 లిప్ స్టిక్స్ డెలివరీ అయ్యాయి. వీటితోపాటు అనేక వస్తువులను జనాలు ఆర్డర్ పెట్టారు.

మినరల్ వాటర్ బాటిళ్లు, కండోమ్‌లు, ఈనో కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్ చేసినట్లు అల్బిందర్ వెల్లడించారు. మరోవైపు, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో జనాలు ఎక్కువగా పాలు, చిప్స్, చాక్లెట్, చీజ్‌లను ఆర్డర్ చేశారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ మాట్లాడుతూ, ప్రతి 8 ఆర్డర్‌లలో 1 శీతల పానీయాల కోసం ఉందని తెలిపారు. ఇది కాకుండా నాన్-ఆల్కహాలిక్ బీర్ ఆర్డర్‌లలో కూడా 1541.72 శాతం పెరుగుదల ఉంది.

Whats_app_banner