Mahindra Scorpio N : మహీంద్రా స్కార్పియో ఎన్ బుకింగ్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Mahindra Scorpio N Booking : మహీంద్రా స్కార్పియో-ఎన్ వేరియంట్లను బుకింగ్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ కారును బుక్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రాకు చెందిన స్కార్పియోకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో ఇది ఒకటి. మార్కెట్లో ఈ ఎస్‌యూవీలను విక్రయిస్తున్నారు. కస్టమర్ల నుండి భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా స్కార్పియో ఎన్ వెయిటింగ్ పీరియడ్ 2 నెలలు పెరిగింది. మీరు మహీంద్రా స్కార్పియో ఎన్ కొనేందుకు ఆసక్తి కలిగి ఉంటే.. మొదట దాని వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్‌ను చెక్ చేయాలి. స్కార్పియో ఎన్ వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ ఇలా ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో ఎన్ వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ విషయానికి వస్తే.. మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ 2, జెడ్ 4, జెడ్ 6, జెడ్ 8, జెడ్ 8 ఎల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ గరిష్టంగా 1 నెల వరకు ఉంది. ఇక జెడ్ 8 సెలెక్ట్ వేరియంట్ కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ 2 నెలల వరకు ఉంటుంది.
ధరలు
మహీంద్రా స్కార్పియో ఎన్ బేస్ వేరియంట్ ధర రూ .13.99 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.24.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో ఉంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్లు
మహీంద్రా స్కార్పియో ఎన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో దొరుకుతుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి. డీజిల్ ఇంజిన్తో 4 డబ్ల్యూడీ ఎంపిక కూడా లభిస్తుంది.
ఫీచర్లు ఏంటి?
మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సన్ రూఫ్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్‌సీ) వంటి సేఫ్టీ ఫీచర్లు వస్తాయి.