Budget 2025 : బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? గత 24 ఏళ్ల ట్రెండ్‌ ఓసారి చూడండి-know how the stock market moved on budget day check the trend of the last 24 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2025 : బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? గత 24 ఏళ్ల ట్రెండ్‌ ఓసారి చూడండి

Budget 2025 : బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? గత 24 ఏళ్ల ట్రెండ్‌ ఓసారి చూడండి

Anand Sai HT Telugu
Jan 30, 2025 11:00 AM IST

Budget 2025 : బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఉంటుుంది. గ్రీన్‌లోకి వెళ్తుందా? లేదంటే రెడ్‌లోకి పడిపోతుందా? గత 24 ఏళ్ల ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ కదలికలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ ఎల్లప్పుడూ భారతీయ స్టాక్ మార్కెట్‌కు ప్రధాన ట్రెండ్‌సెట్టర్‌లలో ఒకటిగా ఉంటుంది. గత 24 సంవత్సరాల డేటా ప్రకారం (ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్) ఈ కాలంలో కేవలం 7 బడ్జెట్ సెషన్‌లలో మాత్రమే మార్కెట్ బడ్జెట్ రోజున 1 శాతం దిగువన కదలాడింది. భారీ ఒడిదొడుకుల మధ్య గత బడ్జెట్ సెషన్‌లో సెన్సెక్స్ 158 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 59,708.08 వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది. 2018 తర్వాత బడ్జెట్ రోజున ఇండెక్స్ ఒక శాతం దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. 2018లో మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది.

yearly horoscope entry point

9 బడ్జెట్ సెషన్‌లలో గ్రీన్

స్టాక్ మార్కెట్ 2022లో 1.4 శాతంతో ముగియగా, 2021లో బడ్జెట్ రోజున 4.7 శాతం పెరిగింది. మార్కెట్ 2020లో 2.5 శాతం, 2019 లో 1.1 శాతం పడిపోయింది. గత 24 సంవత్సరాలలో 2009లో అత్యధికంగా 5.8 శాతం పతనంతో 15 సార్లు బడ్జెట్ రోజున మార్కెట్ నష్టాల్లో ముగిసింది. మిగిలిన 9 బడ్జెట్ సెషన్లలో మార్కెట్ గ్రీన్‌లో ఉంది.

అంతేకాకుండా ఆ 9 సెషన్లలో 2 సెషన్లలో మార్కెట్ బడ్జెట్ రోజున 4 శాతం కంటే ఎక్కువ పెరిగింది. 2021లో బడ్జెట్ రోజున మార్కెట్ 4.7 శాతం పెరిగింది.

బడ్జెట్‌కు ముందు, తర్వాత చూస్తే

బడ్జెట్ డేకి ముందు, తర్వాత ట్రెండ్‌లను పరిశీలిస్తే 24 సంవత్సరాలలో కేవలం 9 సంవత్సరాలలో మాత్రమే మార్కెట్ బడ్జెట్ తర్వాత నెలలో 4 శాతం ప్లస్ లేదా మైనస్‌గా ఉంది. బడ్జెట్ తర్వాత మార్కెట్ అస్థిరతను అంచనా వేయాలని ఇది సూచిస్తుంది.

గత 24 ఏళ్లలో 10 సంవత్సరాల్లో బడ్జెట్‌కు ముందు, పోస్ట్‌ మార్కెట్ ట్రెండ్‌లు ప్రతికూలంగా ఉన్నాయి. 2023 ప్రీ-బడ్జెట్, పోస్ట్-బడ్జెట్ నెలలు రెడ్ జోన్‌లో ఉండి ఒక్కొక్కటి 2 శాతం కంటే ఎక్కువ క్షీణతను నమోదు చేసిన సంవత్సరం. 2022లో కూడా ఇదే విధంగా ఉంది. ఫిబ్రవరిలో బడ్జెట్ అనంతరం నిఫ్టీ 3 శాతం పడిపోయింది. జనవరిలో బడ్జెట్‌కు ముందు 0.1 శాతం తగ్గింది.

అయితే 2021లో ప్రీ బడ్జెట్ నెలలో మార్కెట్ 3.5 శాతం పడిపోయింది. బడ్జెట్ తర్వాత నెలలో ఇది దాదాపు 2 శాతం పెరిగింది. 2020లో కరోనా కాలంలో బడ్జెట్‌కు ముందు, తర్వాత నెలల్లో మార్కెట్ రెడ్‌లో ఉంది. 2018లో బడ్జెట్‌కు ముందు నెలలో చివరిసారిగా మార్కెట్ గ్రీన్‌లో ఉంది. అది 5.6 శాతం పెరిగింది. బడ్జెట్ అనంతర నెలల్లో మార్కెట్ 2016లో అత్యధికంగా 10.75 శాతం పెరిగింది.

Whats_app_banner