Kia Syros vs Skoda Kylaq: కియా సైరోస్ వర్సెస్ స్కోడా కైలాక్; కొత్త సంవత్సరంలో ఈ రెండింటిలో ఏ ఎస్యూవీ ని కొనాలి?
Kia Syros vs Skoda Kylaq: సబ్ కాంపాక్ట్ కేటగిరీలో కియా సైరోస్, స్కోడా కైలాక్ ఎస్యూవీలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో కియా సైరోస్ బుకింగ్ జనవరి 3 న ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో ఈ రెండు ఎస్యూవీల్లో ఏది కొనుగోలు చేయడం మంచిదో, వాటి ఫీచర్స్ అండ్ స్పెక్స్ ఆధారంగా తెలుసుకుందాం.
Kia Syros vs Skoda Kylaq: కియా సైరోస్ భారత మార్కెట్లో లేటెస్ట్ సబ్-ఫర్-మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది కొత్త సంవత్సరంలో విడుదల కానుంది. లాంచ్ అయిన తరువాత, ఇది కియా సోనెట్, కియా సెల్టోస్ మధ్య ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కియా ఇప్పటికే సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సోనెట్ ను కలిగి ఉంది. కియా సోనెట్ టాటా నెక్సాన్, మారుతి సుజుకి (maruti suzuki) బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్యూవి 3ఎక్స్ఓ వంటి గట్టి ప్రత్యర్థులతో పోటీపడుతుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మార్కెట్ వాటా కోసం..
ఇప్పటికే కియా సోనెట్ ఉండగా, మరో సబ్ ఫోర్ మీటర్ ఎస్ యూవీ (suv) ని కియా లాంచ్ చేయడం వెనుక ఉన్న లాజిక్ ఎక్కువ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడం. సైరోస్ ను గణనీయంగా భిన్నంగా ఉంచడానికి, సోనెట్ కంటే సైరోస్ ను మరింత అప్ మార్కెట్ గా మార్చింది. ఇది విస్తృత శ్రేణి ఫీచర్లు, పూర్తిగా ఫ్రెష్ డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది. అలాగే, కియా సోనెట్ తో పోలిస్తే కియా సైరోస్ లో ఎక్కువ క్యాబిన్ స్పేస్, పెద్ద వీల్ బేస్, పెద్ద బూట్ స్టోరేజ్ ఉన్నాయి.
కియా సైరోస్ బుకింగ్స్
వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం కానుంది. అందువల్ల ఈ ఎస్యూవీ ధరను కియా త్వరలో ప్రకటించనుంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో లాంచ్ అయిన మరో సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ స్కోడా కైలాక్. ఇది కియా సిరోస్ ప్రధాన ప్రత్యర్థులలో ఒకటి. స్పెసిఫికేషన్ల పరంగా స్కోడా కెలాక్ కు కియా సైరోస్ ఎలా పోటీ ఇస్తుందో ఇక్కడ సమగ్రంగా తెలుసుకోండి.
కియా సైరోస్ వర్సెస్ స్కోడా కైలాక్: డైమెన్షన్స్
కియా సైరోస్, స్కోడా (skoda cars) కైలాక్ రెండూ 3,995 మిమీ పొడవు ఉంటాయి. కియా సైరోస్ వెడల్పు 1,805 మిమీ కాగా, కైలాక్ వెడల్పు 1783 మిమీ. అలాగే, కియా సైరోస్ ఎత్తు 1,680 మిమీ కాగా, స్కోడా కైలాక్ 1619 మిమీ ఎత్తు ఉంటుంది. కియా సైరోస్ 2,550 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంది, కైలాక్ వీల్ బేస్ 2,566 మిమీ. స్కోడా కైలాక్ లో 446-లీటర్ స్టోరేజ్ తో పోలిస్తే, సైరోస్ లో 465-లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది.
కియా సైరోస్ వర్సెస్ స్కోడా కైలాక్ స్పెసిఫికేషన్లు
కియా (kia motors) సైరోస్ లో 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అదే సమయంలో పెద్ద 1.5-లీటర్ డీజిల్ మోటార్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ యూనిట్ వంటి ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్ పి పవర్, 172ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ లతో లభిస్తుంది. డీజల్ ఇంజన్ గరిష్టంగా 114బిహెచ్ పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, స్కోడా కైలాక్ సింగిల్ పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది. ఇందులో డీజిల్ మోటార్ లేదు. 1.0-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 113బిహెచ్ పి పవర్ మరియు 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును.