ఎస్​యూవీల్లో టాప్​ 4 మోడల్స్​ ఇవి- మరి సేఫ్టీలో ఏది బెస్ట్​?-kia syros vs skoda kylaq vs tata nexon vs mahindra xuv 3xo which is the safest sub compact suv ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎస్​యూవీల్లో టాప్​ 4 మోడల్స్​ ఇవి- మరి సేఫ్టీలో ఏది బెస్ట్​?

ఎస్​యూవీల్లో టాప్​ 4 మోడల్స్​ ఇవి- మరి సేఫ్టీలో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

ఇండియా సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో కియా సైరోస్​, స్కోడా కైలాక్​, టాటా నెక్సాన్​, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ మధ్య విపరీతమైన పోటీ ఉంది. మరి సేఫ్టీ పరంగా ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్

భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ కింద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన తాజా మోడల్ కియా సైరోస్ ఎస్​యూవీ. ఫలితంగా భారతదేశంలో సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్ మరింత పోటీగా మారింది. ఇది స్కోడా కైలాక్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓల సరసన చేరింది. ఇవి కూడా క్రాష్​ టెస్ట్​లో టాప్​ రేటింగ్స్​ పొందాయి. ఈ నేపథ్యంలో సేఫ్టీ పరంగా ఏ ఎస్​యూవీ బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

కియా సైరోస్ వర్సెస్ స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ వర్సెస్ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ: సేఫ్టీ రేటింగ్స్..

అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 32 పాయింట్లకు గాను 30.21 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 49కి 44.42 పాయింట్లు సాధించింది కియా సైరోస్​ ఎస్​యూవీ. హెచ్​టీఎక్స్ + పెట్రోల్-డీసీటీ, హెచ్​టీకే (ఓ) పెట్రోల్-ఎంటీ వర్షెన్లలో పరీక్షించిన ఈ ఎస్​యూవీ ఫ్రంటల్ ఆఫ్​సెట్ పరీక్షలో 14.21/16, సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో పూర్తి 16/16 స్కోరు సాధించింది. భారత్ ఎన్​సీఏపీ.. బిల్ట్​, భద్రతా వ్యవస్థలు రెండు కేటగిరీల్లో గట్టి రక్షణ కల్పిస్తున్నట్లు గుర్తించింది.

ఇటీవల భారత్ ఎన్​సీఏపీలోకి ప్రవేశించిన స్కోడా కైలాక్ ఏఓపీలో 30.88/32, సీఓపీలో 45/49తో కాస్త మెరుగ్గా రాణించింది. ఫ్రంటల్ ఇంపాక్ట్​లో 15.035/16, సైడ్ ఇంపాక్ట్​లో 15.840/16 స్కోర్ సాధించింది.

ఇంతకుముందు పరీక్షించిన టాటా నెక్సాన్ ఎస్​యూవీ ఏఓపీలో 32.22 పాయింట్లు, కీఓపీలో 44.52 పాయింట్లను నమోదు చేసింది. ఇది ఇప్పటివరకు అత్యధిక వయోజన రక్షణ స్కోరు. ఇది పాదచారుల భద్రత కోసం యూఎన్​127, జీటీఆర్​9 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. గ్లోబల్ ఎన్​సీఏపీ, ఈఎస్​సీ, సీట్ బెల్ట్ అలర్ట్ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఏఓపీలో 29.36, సిఓపిలో 43 పాయింట్లు సాధించింది. సైడ్ ఇంపాక్ట్​ లో 16కు 16 స్కోరుతో అద్భుతమైన పనితీరును, ఫ్రంటల్ క్రాష్​లో 16 కు 13.36 స్కోరుతో సాలిడ్ రేటింగ్ సాధించింది. సైడ్ పోల్ టెస్టింగ్​లోనూ రాణించింది.

కియా సైరోస్ వర్సెస్ స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ వర్సెస్ మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ: భద్రతా ఫీచర్లు..

కియా సైరోస్​లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, రేర్ ఆక్యుపెంటర్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉన్నాయి. ఇది లెవల్ 2 ఏడీఏఎస్​ని కూడా కలిగి ఉంది. ఇది దాని యాక్టివ్​ సేఫ్టీ క్రిడెన్షియల్స్​ని పెంచుతుంది.

స్కోడా కైలక్​లో ఆరు ఎయిర్ బ్యాగులు, టీసీఎస్, ఎంఎస్ఆర్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రేర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు మొత్తం 35 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్​లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈఎస్​సీ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓలో ఆరు ఎయిర్ బ్యాగులు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్​లు, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. ఇది కుటుంబాలకు, రోజువారీ డ్రైవర్లకు మంచి మొత్తం భద్రతను అందిస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం