New SUV : లగ్జరీ ఫీచర్స్, లుక్స్‌తో కియా కొత్త ఫ్యామిలీ ఎస్యూవీ..
కియా మోటార్స్ నుంచి ఒక కొత్త ఎస్యూవీ.. ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ ఎస్యూవీ పేరుతో పాటు లుక్స్‌ని సంస్థ తాజాగా రివీల్ చేసింది. ఆ వివరాలు..
కియా ఇండియా తన కొత్త ఎస్యూవీ పేరును రివీల్ చేసింది. కియా సైరోస్ అని పిలిచే ఈ ఎస్యూవీ.. భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెస్ట్ సెల్లింగ్ కియా సెల్టోస్, కియా సోనెట్ మధ్య ప్లేస్ చేసి ఉంటుందని తెలుస్తోంది. కియా 2.0 వ్యూహం కింద కంపెనీ డిజైన్ 2.0 ఫిలాసఫీని కలిగి ఉండి, భారతదేశంలో తయారైన తొలి ఎస్యూవీ ఈ కియా సైరోస్!
ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన కియా ఈవీ9, కియా కార్నివాల్ లిమోసిన్ నుంచి ప్రేరణ పొందిన ఆధునిక డిజైన్ సౌందర్యాన్ని రాబోయే ఎస్‌యూవీలో కలిగి ఉంటుంది.
కియా సైరోస్ ప్రాధమిక స్కెచ్‌లు ఈ ఎస్యూవీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మరే ఇతర ఎస్‌యూవీకి లేని ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన ఈవీ 9 నుంచి సైరోస్ ఫ్రెంట్ డిజైన్ చాలా ప్రేరణ పొందింది. కంపెనీ ఇటీవల పంచుకున్న టీజర్ ప్రకారం, కియా సైరోస్‌లో డీఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్‌తో త్రీ ఎలిమెంట్ వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఉంటుంది.
కియా సైరోస్- ఇతర విశేషాలు..
డిజైన్ స్కెచ్‌ల ప్రకారం.. కియా సైరోస్ రూఫ్ రెయిల్స్ కలిగి ఉంటుంది. అయినప్పటికీ అవి ఆచరణాత్మక ప్రయోజనం కోసం ఉపయోగపడతాయా లేదా పూర్తిగా సౌందర్యాత్మకంగా ఉంటాయా అనేది అస్పష్టంగా ఉంది. అంతేకాక, కియా సైరోస్ విశాలమైన, ఓపెన్ క్యాబిన్ కోసం గణనీయమైన పెద్ద విండోలను పొందుతుంది. అదనంగా, ఈ వాహనం 4-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ని కలిగి ఉంటుంది.
కియా సోనెట్‌కు మరింత ప్రీమియం మోడల్‌గా ఈ కియా సైరోస్‌ను అందించనున్నారు. అయితే ఇది కియా సెల్టోస్ కింద ప్లేస్ చేసి ఉంటుంది కాబట్టి కియా సైరోస్ మిశ్రమ ఫీచర్లను పొందుతుందని ఆశించొచ్చు. స్పై షాట్లు ఇప్పటికే సైరోస్ కోసం ఆల్‌రౌండ్ ఎల్ఈడీ లైటింగ్‌ని ధృవీకరించినప్పటికీ, ఇంటీరియర్‌లో కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు.
కియా సైరోస్ డ్యాష్ బోర్డ్‌లో టూ-స్పోక్, ఫ్లాట్-బాటమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ట్విన్-స్క్రీన్ సెటప్‌ను పొందే అవకాశం ఉంది. 2 స్పోక్ స్టీరింగ్ వీల్ కొత్తగా ఉన్నప్పటికీ, ట్విన్ స్క్రీన్ సెటప్ ఇతర కియా మోడళ్లలో కూడా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ వైపర్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ప్రీమియం ఆడియో సిస్టెమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కియా సైరోస్: ఇంజిన్..
కియా సైరోస్ పెట్రోల్, ఈవీ ఇంజిన్లతో లభిస్తుందని భావిస్తున్నారు. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండవచ్చు. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118బీహెచ్పీ పవర్, 172ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్, డీజిల్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది కియా కొత్త ఎస్యూవీ ప్రారంభ ధరను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
ఈ కియా సైరోస్ లాంచ్ డేట్, ధరతో పాటు ఇతర వివరాలను త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్