Best family car : మిడిల్‌క్లాస్ వారి ముందుకు మరో ఫ్యామిలీ కార్- కియా సైరోస్ ఎస్యూవీ వచ్చేసింది..
Kia Syros SUV : కియా సైరోస్ ఎస్యూవీ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ మైలేజ్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ సంస్థలోని ఎస్యూవీ సెగ్మెంట్లోకి మరో కొత్త మోడల్ ఎంట్రీ ఇచ్చింది. కియా సైరోస్ ఎస్‌యూవీని కియా మోటార్స్ సంస్థను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కియా సైరోస్ వేరియంట్లు..
కియా సైరోస్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. హెచ్టీకే, హెచ్టీకే+, హెచ్‌టీఎక్స్, హెచ్టిఎక్స్ +.
కియా సైరోస్ కలర్ ఆప్షన్స్..
కియా సైరోస్ ఎస్యూవీ గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, ప్యూటర్ ఆలివ్, ఇంటెన్స్ రెడ్, ఫ్రాస్ట్ బ్లూ, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంపీరియల్ బ్లూ, గ్రావిటీ గ్రే అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
కియా సైరోస్ ఇంజిన్..
కియా సైరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 బీహెచ్పీ పవర్‌ని, 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత డీజిల్ ఇంజిన్ 115బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి. టర్బో పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ యూనిట్‌ను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
కియా సైరోస్ మైలేజ్ వివరాలు..
కియా సైరోస్ ఎస్యూవీ.. మాన్యువల్ గేర్ బాక్స్‌తో పెట్రోల్ ఇంజిన్ ఇంధన సామర్థ్యం లీటరుకు 18.20 కిలోమీటర్లు! ఇది డీసీటీతో లీటరుకు 17.68 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. డీజిల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ లీటరుకు 20.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం లీటరుకు 17.65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
కియా సైరోస్ ఎస్యూవీ ధర..
కియా సైరోస్ ప్రారంభ ధర రూ .8.99 ఎక్స్-షోరూమ్. ఈ ఎస్యూవీ ఇప్పటికే డీలర్షిప్ షోరూమ్స్‌కి చేరుకుంది. ఆసక్తిగల కస్టమర్లు టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్స్ని సంప్రదించవచ్చు. డెలివరీలు త్వరలోనే మొదలవుతాయి.
సేల్స్ పరంగా కియా మోటార్స్ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో కియా సైరోస్ ఎంట్రీతో ఎస్యూవీ సెగ్మెంట్లో సంస్థ మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్న కియా సోనెట్, కియా సెల్టోస్ మధ్యలో ఈ కియా సైరోస్ ప్లేస్ చేసి ఉంటుంది. ఈ మోడల్ని ఫ్యామిలీ ఎస్‌యూవీగా సంస్థ ప్రమోట్ చేస్తోంది.
సంబంధిత కథనం