Best base variants : సైరోస్​ వర్సెస్​ కైలాక్​- రెండు ఫీచర్​ లోడెడ్​ ‘బేస్​ వేరియంట్ల’లో ఏది బెస్ట్​?-kia syros or skoda kylaq which budget friendly variant is the smarter buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Base Variants : సైరోస్​ వర్సెస్​ కైలాక్​- రెండు ఫీచర్​ లోడెడ్​ ‘బేస్​ వేరియంట్ల’లో ఏది బెస్ట్​?

Best base variants : సైరోస్​ వర్సెస్​ కైలాక్​- రెండు ఫీచర్​ లోడెడ్​ ‘బేస్​ వేరియంట్ల’లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

Kia Syros vs Skoda Kylaq : కియా సైరోస్​ వర్సెస్ స్కోడా​ కైలాక్​- ఈ రెండు ఎస్​యూవీల ఫీచర్​ లోడెడ్​ బేస్​ వేరియంట్లలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

సైరోస్​ వర్సెస్​ కైలాక్

ఇండియాలో సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ప్రాడక్ట్స్​ని లాంచ్​ చేస్తూ ప్రైజ్​ వార్​ని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కియా సైరోస్​, స్కోడా కైలాక్​ ఎస్​యూవీలు ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టాయి. కియా సైరోస్​, స్కోడా కైలాక్​ల బేస్​ వేరియంట్లు కూడా మంచి ఫీచర్​ లోడెడ్​ ఆప్షన్స్​గా వస్తుండటం ఇక్కడ హైలైట్​ విషయం. మీరు మార్కెట్​లో కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ కోసం చూస్తూ, బడ్జెట్ తక్కువగా ఉంటే, స్కోడా కైలాక్- కియా సైరోస్​లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

స్కోడా కైలాక్: బేస్ వేరియంట్..

స్కోడా కైలాక్​ బేస్​ వేరియంట్​ పేరు క్లాసిక్​. దీని ఎక్స్​షోరూం ధర రూ. 7.89లక్షలు. ధరను బట్టి మంచి ఫీచర్ల జాబితాతో వస్తోంది ఈ ఎస్​యూవీ. కంపెనీ లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్​ను కలిగి ఉంది. అయితే, ఎక్స్​టీరియర్​లో క్లాసిక్ వేరియంట్ 16 ఇంచ్​ స్టీల్ వీల్స్​తో పాటు ప్లాస్టిక్ కవర్లు, బాడీ కలర్ ఓఆర్​వీఎమ్​లను పొందుతుంది.

స్కోడా కైలాక్​ బేస్​ వేరియంట్​లో ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ లేదు! కానీ కైలాక్ క్లాసిక్ మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, రేర్ ఏసీ వెంట్స్, డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్​ప్లే (ఎంఐడీ)తో అనలాగ్ డయల్స్, ఫ్రెంట్ సెంటర్ ఆర్మ్​రెస్ట్​తో వస్తుంది. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఆటోమేటిక్ ఇంజిన్ స్టార్ట్- స్టాప్, టిల్ట్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్, పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఫ్యాబ్రిక్ సీట్లు, ముందు భాగంలో 12 వోల్ట్ ఛార్జింగ్ ప్లగ్ వంటివి ఉన్నాయి.

స్కోడా కైలాక్ క్లాసిక్​లో 1.0 లీటర్ 3 సిలిండర్​ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్ ఉంది. ఇది స్కోడా కుషాక్​తో సహా ఇతర స్కోడా ఇండియా 2.0 ప్రాజెక్ట్ కార్లకు కూడా పవర్​ని ఇస్తుంది. కైలాక్ ఎస్​యూవీలోని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 114బీహెచ్​పీ పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది.

కియా సైరోస్: బేస్ వేరియంట్..

కియా సైరోస్ బేస్​ వేరియంట్​ పేరు హెచ్​టీకే. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .9 లక్షలు. బేస్ ట్రిమ్ అయినప్పటికీ, ఇందులో మంచి ఫీచర్లే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హెచ్​టీకే వర్షెన్​లో బ్లాక్ వీల్ కవర్లతో కూడిన 15-ఇంచ్​ స్టీల్ వీల్స్, హాలోజెన్ హెడ్​ల్యాంప్స్, షార్క్​ఫిన్ యాంటెనా, ఫ్రెంట్​-రేర్​లో సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉంటాయి.

కియా సైరోస్​ క్యాబిన్ డ్యూయెల్-టోన్ గ్రే, బ్లాక్ సెమీ-లెథరెట్ అప్​హోలిస్ట్రీతో వస్తుంది. వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన 12.30 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డైనమిక్ గైడెన్స్​తో రివర్స్ కెమెరా, పవర్ అడ్జెస్టెబుల్ మిర్రర్లు- విండోస్, రేర్ ఏసీ వెంట్స్, డోర్ కర్టెన్లు, నాలుగు టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ ఔట్​లెట్స్​ వంటివి ఉన్నాయి.

సైరోస్ శ్రేణి పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్​తో వస్తోంది. అయితే సైరోస్ బేస్ వేరియంట్​ 6-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​తో, పెట్రోల్ ఇంజిన్​తో మాత్రమే లభిస్తుంది. సోనెట్ నుంచి వచ్చిన 1.0-లీటర్ టర్బోఛార్జ్డ్ యూనిట్ సైరస్​కి పవర్​ని ఇస్తుంది. ఇది 118 బీహెచ్​పీ పవర్​, 172 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం