Kia Syros : మిడిల్ క్లాస్ వారి ముందుకు కొత్త ఫ్యామిలీ ఎస్యూవీ ఆప్షన్- ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Kia Syros on road price Hyderabad : కియా సైరోస్ ఎస్‌యూవీని కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే హైదరాబాద్‌లో కియా సైరోస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలో ఎస్‌యూవీలకు నిత్యం పెరుగుతున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. దీని ఫలితంగా కస్టమర్స్‌కి మంచి మంచి ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే కియా మోటార్స్ సంస్థ ఇండియాలో తాజాగా కియా సైరోస్ పేరుతో ఒక ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఇదొక ఫ్యామిలీ ఎస్యూవీ. తక్కువ బడ్జెట్లో, మంచి ఫీచర్ లోడెడ్ కారు కొనాలని చూస్తున్న వారికి ఈ కియా సైరోస్ మంచి ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీని కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో కియా సైరోస్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో కియా సైరోస్ ఆన్‌రోడ్ ప్రైజ్..
కియా సైరోస్ హెచ్టీకే టర్బో పెట్రోల్- రూ. 10.65 లక్షలు
హెచ్టీకే ఆప్ట్ టర్బో పెట్రోల్- రూ. 11.83 లక్షలు
హెచ్టీకే ఆప్ట్ డీజిల్- రూ. 13.51 లక్షలు
హెచ్టీకే ప్లస్ టర్బో పెట్రోల్- రూ. 14.05 లక్షలు
హెచ్టీకే ప్లస్ డీజిల్- రూ. 15.34 లక్షలు
హెచ్టీకే ప్లస్ టర్బో డీసీటీ- రూ. 15.63 లక్షలు
హెచ్‌టీఎక్స్ టర్బో పెట్రోల్- రూ. 16.24 లక్షలు
హెచ్‌టీఎక్స్ డీజిల్- రూ. 17.53 లక్షలు
హెచ్‌టీఎక్స్ టర్బో డీసీటీ పెట్రోల్- రూ. 17.82 లక్షలు
హెచ్‌టీఎక్స్ ప్లస్ టర్బో డీసీటీ పెట్రోల్- రూ. 19.52 లక్షలు
హెచ్‌టీఎక్స్ ప్లస్ ఆప్ట్ టర్బో డీసీటీ పెట్రోల్- రూ. 20.49 లక్షలు
హెచ్‌టీఎక్స్ ప్లస్ డీజిల్ ఏటీ- రూ. 20.81 లక్షలు
హెచ్‌టీఎక్స్ ప్లస్ ఆప్ట్ డీజిల్ ఏటీ- రూ. 21.79 లక్షలు
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుంది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవాలి.
కియా సైరోస్ ఎస్యూవీ..
జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో సైరోస్ని కియా సంస్థ ప్రదర్శించింది. ఇక దేశంలో ఫిబ్రవరి 1న ఈ మోడల్ని లాంచ్ చేసింది.
కియా సైరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో వస్తోంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి. టర్బో పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ యూనిట్‌ను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
కియా సైరోస్ ఎస్యూవీ.. మాన్యువల్ గేర్ బాక్స్‌తో పెట్రోల్ ఇంజిన్ ఇంధన సామర్థ్యం లీటరుకు 18.20 కిలోమీటర్లు! ఇది డీసీటీతో లీటరుకు 17.68 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. డీజిల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ లీటరుకు 20.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కోసం లీటరుకు 17.65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
సంబంధిత కథనం