Kia Syros bookings: రేపటి నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం; డెలివరీలు ఎప్పుడంటే?-kia syros bookings to open on january 3rd 2025 prices to be revealed on ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Syros Bookings: రేపటి నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం; డెలివరీలు ఎప్పుడంటే?

Kia Syros bookings: రేపటి నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం; డెలివరీలు ఎప్పుడంటే?

Sudarshan V HT Telugu

Kia Syros bookings: కియా నుంచి వస్తున్న సరికొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా సైరోస్ బుకింగ్స్ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కియా సిరోస్ కియా లైనప్ లోని మరో రెండు ఎస్యూవీలైన సోనెట్, సెల్టోస్ మధ్య స్థానం పొందుతుంది.

రేపటి నుంచి కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభం

Kia Syros bookings: కియా సైరోస్ బుకింగ్స్ జనవరి 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న కొనుగోలు దారులు రూ. 25 వేలను టోకెన్ అమౌంట్ గా చెల్లించి కియా సైరోస్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ధరలను ఫిబ్రవరి 1 వ తేదీన ప్రకటిస్తారు. ఫిబ్రవరి మధ్య నుంచి సైరోస్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కియా లైనప్ లో సోనెట్, సెల్టోస్ ల మధ్య కియా సైరోస్ స్థానం దక్కించుకోనుంది. హెచ్ టికె, హెచ్ టికె+, హెచ్ టిఎక్స్, హెచ్ టిఎక్స్ + అనే నాలుగు వేరియంట్లలో కియా సైరోస్ లభిస్తుంది.

కియా సైరోస్ ఇంజన్ ఆప్షన్స్

కియా సైరోస్ లో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్ పి పవర్, 172ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. డీజల్ ఇంజన్ 116బిహెచ్ పి పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ కోసం 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్ కోసం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉంటుంది.

కియా సైరోస్ సెక్యూరిటీ ఫీచర్లు

కియా సైరోస్ ప్రస్తుతం ఉన్న కె 1 ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉంది. అయితే దీనిని బలోపేతం చేసినట్లు కియా (kia motors) తెలిపింది. ఈ వాహనం లేన్ కీప్ అసిస్ట్ తో సహా 16 అధునాతన అడాప్టివ్ సెక్యూరిటీ ఫీచర్లతో వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగులు తదితర ఫీచర్లు ఇందులో (Kia Syros) ఉన్నాయి. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్ కూడా ఉంది.

కియా సైరోస్ ఇతర ఫీచర్లు

కియా సైరోస్ లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో కూడిన 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ (android) ఆటో, ఆపిల్ (apple) కార్ప్లే సపోర్ట్ ను పొందుతుంది. అదనంగా, కియా సైరోస్ క్యాబిన్ లో వెంటిలేటెడ్ సీట్లు (ముందు మరియు వెనుక రెండూ), స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ చేయడానికి పుష్ బటన్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఛార్జర్, ట్విన్ యుఎస్బి సి పోర్ట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, పనోరమిక్ సన్ రూఫ్ ఉన్నాయి.