Kia EV4 : మతిపోయే స్టైలిష్ డిజైన్‌తో కియా ఈవీ4- ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Kia EV4 : కియా ఈవీ4 లాంచ్‌కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ కియా ఈవీ4 ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని సంస్థ రిలీజ్ చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ప్రపంచంలో ఉన్న ‘ఎలక్ట్రిక్’ వార్ని కియా మోటార్స్ మరింత పెంచింది! ఫిబ్రవరి 27న కియా ఈవీ4ని సంస్థ ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఈ మోడల్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేసింది. ఈ లుక్‌ని చూసిన వారందరు వావ్ అంటున్నారు! కియా ఈవీ4 డిజైన్ అదిరిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కియా ఈవీ ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్లోకి వెళ్లే అవకాశం ఉంది. 2026లో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కోసం సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ కియా ఈవీ4.. టెస్లా మోడల్ 3, ఎంజీ 4, వోక్స్వ్యాగన్ ఐడీ.4 వంటి మోడల్స్‌కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కియా ఈవీ4 ఫస్ట్ లుక్ వివరాలను ఇక్కడ చూసేయండి..
కియా ఈవీ 4..
2023లో మొదటిసారిగా ఈ ఈవీ4 కాన్సెప్ట్ వర్షెన్‌ని కియా మోటార్స్ ప్రదర్శించింది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్.. రెండేళ్ల క్రితం వచ్చిన కాన్సెప్ట్ వర్షెన్‌నే. లాంచ్ అయినప్పుడు ఈవీ4 రెండు బాడీ స్టైల్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. అంటే.. కియా ఈవీ4 అనేది ఎలక్ట్రిక్ సెడాన్‌గా, ఎలక్ట్రిక్ హ్యాచ్బాక్గా అందుబాటులోకి వస్తుంది. వీటి సైజులు కాస్త మారతాయి.
కియా ఈవీ4: డిజైన్ ఎలిమెంట్స్..
కార్ల తయారీ సంస్థ షేర్ చేసిన చిత్రాలు.. సెడాన్, హ్యాచ్ బ్యాక్ డిజైన్లను వెల్లడిస్తున్నాయి. ఈవీ9 వంటి కొత్త తరం ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పటికే కనిపించిన కియా కొత్త డిజైన్ ఫిలాసఫీ వీటిల్లోనూ చూడవచ్చు. కియా గ్లోబల్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ కరీం హబీబ్ మాట్లాడుతూ.. "ఈవీ4సెడాన్ స్లీక్, లో-నోస్, లాంగ్ టెయిల్ సిల్హౌయిట్ని కలిగి ఉంటుంది. ఈవీ4హ్యాచ్బ్యాక్చురుకైన, బహుముఖ ఆల్ రౌండర్! విలక్షణమైనది, శుభ్రమైనది కూడా. ఇది ఎటువంటి పరిస్థితిలోనైనా రాణించడానికి తయారైంది," అని అన్నారు.
ఇతర కొత్త తరం కియా ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే.. ఈ ఈవీ4 కూడా ముందు భాగంలో సిగ్నేచర్ 'టైగర్ ఫేస్' డిజైన్ని పొందుతుంది. వర్టికల్లీ ఓరియెంటెడ్ హెడ్‌లైట్స్, సొగసైన డీఆర్ఎల్ యూనిట్లు ఇందులో ఉంటాయి. రేర్ వరకు వెళ్లే స్లోపింగ్ రూఫ్‌లైన్, వైడ్ స్టాండ్స్‌తో ఈవీ లుక్ మరింత స్పోర్టీగా మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో టూ-పీస్ రేర్ స్పాయిలర్, వర్టికల్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
కియా ఈవీ4: ఇంటీరియర్, బ్యాటరీ, రేంజ్..
ఈ కియా ఈవీ4 బ్యాటరీపై సంస్థ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్లకు సంబంధించిన వివరాలను కూడా గోప్యంగా ఉంచింది. కియా ఈ-జీఎంపీ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించే ఈవీ 6తో ఈవి 4 తన మూలాలను పంచుకునే అవకాశం ఉంది. బ్యాటరీ, రంజ్ లేదా ఛార్జింగ్ సామర్థ్యం గురించి ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
కియా ఈవీ4 ఇండియా లాంచ్, ధరపైనా క్లారిటీ రావాల్సి ఉంది. మరి లాంచ్ టైమ్‌లో వీటి గురించి సంస్థ ఏమైనా మాట్లాడుతుందో లేదో చూడాలి.
సంబంధిత కథనం