Kia India car sales : దుమ్మురేపిన కియా, ఎంజీ మోటార్​.. మార్చ్​లో భారీగా సేల్స్​!-kia india and mg motors reports amazing growth in sales see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Kia India And Mg Motors Reports Amazing Growth In Sales See Full Details Here

Kia India car sales : దుమ్మురేపిన కియా, ఎంజీ మోటార్​.. మార్చ్​లో భారీగా సేల్స్​!

Sharath Chitturi HT Telugu
Apr 01, 2023 01:51 PM IST

Kia India car sales in Mach 2023 : మార్చ్​లో కియా, ఎంజీ మోటార్​ సేల్స్​ దుమ్మురేపాయి. కార్​ సేల్స్​ డేటాను రెండు సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఆ వివరాలు..

దుమ్మురేపిన కియా, ఎంజీ మోటార్​.. మార్చ్​లో భారీగా సేల్స్​!
దుమ్మురేపిన కియా, ఎంజీ మోటార్​.. మార్చ్​లో భారీగా సేల్స్​! (HT AUTO)

Kia India car sales : దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​లో కియా ఇండియా హవా కొనసాగుతోంది. 2023 ఆర్థిక ఏడాదిలో ఈ సంస్థ మార్కెట్​ షేరు 7.4శాతానికి పెరిగింది. కియా క్యారెన్స్​.. సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా నిలిచింది. మొత్తం మీద గత ఆర్థిక ఏడాదిలో 74,735 క్యారెన్స్​ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక 2022 క్యూ4తో పోల్చుకుంటే.. 2023 నాలుగో త్రైమాసికంలో సంస్థ ఎగుమతులు 22శాతం వృద్ధిచెందడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Kia car sales in March 2023 : ఇక 2023 మార్చ్​లో మొత్తం మీద 21,501 యూనిట్లను విక్రయించింది కియా మోటార్స్​ ఇండియా. కియా సెల్టోస్​ (8,677) ఎక్కువగా అమ్ముడుపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​ (6,554), క్యారెన్స్​ (6,102) నిలిచాయి. మరోవైపు ఎఫ్​వై2023లో 85,754 యూనిట్​లను ఎగుమతి చేసింది కియా ఇండియా. 2023 మార్చ్​లో 6,200 యూనిట్​లను విదేశాలకు పంపించింది.

Kia India latest news : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి కియా మోటార్స్​ అడుగుపెట్టి నాలుగేళ్లు గడిచిపోయాయి. దేశవ్యాప్తంగా 213 నగరాల్లో కియాకు 425 డీలర్​షిప్​ నెట్​వర్క్స్​ ఉన్నాయి. పైగా.. ఓబీడీ-2 రెడీ లైనప్​తో కియా మోటార్స్​ సిద్ధంగా ఉంది. ఆర్​డీఈ నార్మ్స్​కు తగ్గట్టుగా.. సెల్టోస్​, సోనెట్​, క్యారెన్స్​ను రెడీ చేసింది. వీటిల్లో కొన్నింటికి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లు కూడా రానున్నాయి.

అదరగొట్టిన ఎంజీ మోటార్​..

2023 మార్చ్​లో ఎంజీ మోటార్​ అదరగొట్టింది! మొత్తం మీద 6,051 యూనిట్​లను విక్రయించింది. 2019లో ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి అడుగుపెట్టిన ఎంజీ మోటార్​కు.. ఇవే అత్యధిక సేల్స్​ (నెలల పరంగా) నెంబర్లు. ఈసారి ఎంజీ హెక్టార్​ అప్డేటెడ్​ వర్షెన్​ దుమ్మురేపింది. మార్చ్​లో ఈ మోడల్​ అత్యధికంగా అమ్ముడుపోయింది.

MG Motor India car sales in March 2023 : 2019లో హెక్టార్​ ఎస్​యూవీ లాంచ్​తో ఇండియాలోకి అడుగుపెట్టింది ఎంజీ మోటార్​. జెడ్​ఎస్​ ఈవీ, గ్లాస్టర్​, ఆస్టర్​ వంటి మోడల్స్​తో కస్టమర్లను ఆకర్షించింది. హెక్టార్​తో పాటు జెడ్​ఎస్​ ఈవీకి అప్డేటెడ్​ వర్షెన్​లు వచ్చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడల్స్​ను లాంచ్​ చేసి.. ఇండియా మార్కెట్​ షేర్​ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంస్థ.

2023 ఆర్థిక ఏడాది ముగిసిన నేపథ్యంలో.. దేశంలోని వాహన సంస్థల సేల్స్​ డేటాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ సంస్థ సేల్స్​ పెరిగాయి? వేటి సేల్స్​ తగ్గాయి? అన్న అంశాలపై వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం