Kia new electric car : ఒకేసారి రెండు ఎలక్ట్రిక్​ కార్లను రివీల్​ చేసిన కియా!-kia ev3 suv and ev4 sedan unveiled check whats special ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Kia Ev3 Suv And Ev4 Sedan Unveiled Check What's Special

Kia new electric car : ఒకేసారి రెండు ఎలక్ట్రిక్​ కార్లను రివీల్​ చేసిన కియా!

Sharath Chitturi HT Telugu
Nov 17, 2023 12:59 PM IST

Kia new electric car : కియా ఈవీ3, ఈవీ4 కాన్సెప్ట్​ వర్షెన్స్​ని సంస్థ తాజాగా రివీల్​ చేసింది. డిజైన్​ చాలా ఫ్యూచరిస్టిక్​గా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకేసారి రెండు ఎలక్ట్రిక్​ కార్లను రివీల్​ చేసిన కియా!
ఒకేసారి రెండు ఎలక్ట్రిక్​ కార్లను రివీల్​ చేసిన కియా!

Kia new electric car : అంతర్జాతీయ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో దూసుకెళుతున్న కియా మోటార్స్​ సంస్థ.. తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు పక్కాగా ప్లాన్​ చేసుకుంది! కియా ఈవీ6, ఈవీ9తో పటిష్ఠంగా ఉన్న ఈ సంస్థ ఈవీ పోర్ట్​ఫోలియోలో.. త్వరలోనే మరో రెండు ఎలక్ట్రిక్​ కార్లు చేరనున్నాయి. వాటి పేర్లు.. కియా ఈవీ3, కియా ఈవీ4. అమెరికా లాస్​ ఏంజెల్స్​లో జరుగుతున్న ఎల్​ఏ ఆటో షోలో.. తొలిసారిగా వీటి కాన్సెప్ట్​ మోడల్స్​ని ప్రదర్శించింది సంస్థ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

కియా మోటార్స్​ కొత్త ఎలక్ట్రిక్​ కార్లు..

కియా ఈవీ3 అనేది ఒక ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. ఇక కియా ఈవీ4 అనేది ఎలక్ట్రిక్​ సెడాన్​. ఈ రెండింట్లోనూ ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ కలిగి ఉన్నాయి. డిజైన్​ పరంగా రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి. కియా ఈవీ3లో ఫార్వ్​డ్​ ఫుష్డ్​ విండ్​షీల్డ్స్​, స్లోపింగ్​ రూఫ్​లైన్​, డిస్​కనెక్టెడ్​ సీ పిల్లర్​ వంటివి ఉన్నాయి. ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​ వస్తున్నాయి. ఇక ఈ ఎస్​యూవీ లోపలి భాగం.. స్టైల్​, ప్రాక్టికాలిటీ కలగలిపి ఉన్నట్టు కనిపిస్తోంది. సాఫ్ట్​ మూడ్​ లైటింగ్​, అల్ట్రా-క్లీన్​ డాష్​బోర్ట్​ సర్ఫేసింగ్​ మెరుగ్గా ఉన్నాయి. అడ్వాన్స్​డ్​ ఈర్గోనామిక్​ సీట్​ డిజైన్​ని ఉపయోగించడంతో.. సీట్లనేవి లైట్​వెయిట్​గా, స్లిమ్​గా మారాయి.

Kia EV3 SUV : ఇక కియా ఈవీ4 విషయానికొస్తే.. ఇందులో లోనోస్​, లాంగ్​-టైల్​ సిలౌట్​, టెక్నికల్​ రూఫ్​ స్పాయిలర్​లు ఉన్నాయి. ఫ్రెంట్​ బంపర్​ చివర్లో స్టైలిష్​గా డిజైన్​ చేసిన హెడ్​లైట్స్​ అమర్చి ఉన్నాయి. కేబిన్​లోని సెంట్రల్​ కన్సోల్​లో సెంట్రల్​ ప్యానెల్​ చూడొచ్చు. 3డీ ఎఫెక్ట్​ వచ్చే విధంగా.. కేబిన్​లోని ఫాబ్రిక్​ని రూపొందించారు.

కియా ఈవీ4 సెడాన్​ కాన్సెప్ట్​..
కియా ఈవీ4 సెడాన్​ కాన్సెప్ట్​..

Kia EV 4 sedan concept model : కియా ఈవీ3 ఎస్​యూవీ, ఈవీ4 సెడాన్​లు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇప్పటికే ఈ రెండు.. హాట్​ టాపిక్​గా మారాయి. ఇక వీటితో.. సంస్థ ఈవీ పోర్ట్​ఫోలియో మరింత పటిష్ఠంగా మారుతుందని కియా మోటార్స్​ భావిస్తోంది.

కాగా.. ఈ రెండు ఈవీలు కూడా ప్రస్తుతం కాన్సెప్ట్​ స్టేజ్​లోనే ఉన్నాయి. ప్రొడక్షన్​ స్టేజ్​ ఎప్పుడు మొదలవుతుందనేది సంస్థ చెప్పలేదు. ఫలితంగా.. లాంచ్​ డేట్​పైనా క్లారిటీ లేదు. వీటిపై సంస్థ స్పందించాల్సి ఉంది.

ఇక కియా ఈవీ2ని కూడా సంస్థ సిద్ధం చేస్తోందని టాక్​ నడుస్తోంది. ఇది.. సంస్థ నుంచి వస్తున్న అతి చౌకైన ఎలక్ట్రిక్​ వెహికిల్​గా ఉంటుందని సమాచారం. ఈ మోడల్​పైనా త్వరలోనే అప్డేట్స్​ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం