New SUV in India : ప్రీమియం ఫీల్​ ఇచ్చే మిడ్​- రేంజ్​ ఎస్​యూవీ ఇది- ఫ్యామీలికి చాలా కంఫర్ట్​!-kia clavis suv teaser suggests bold rv inspired design for the indian market ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Suv In India : ప్రీమియం ఫీల్​ ఇచ్చే మిడ్​- రేంజ్​ ఎస్​యూవీ ఇది- ఫ్యామీలికి చాలా కంఫర్ట్​!

New SUV in India : ప్రీమియం ఫీల్​ ఇచ్చే మిడ్​- రేంజ్​ ఎస్​యూవీ ఇది- ఫ్యామీలికి చాలా కంఫర్ట్​!

Sharath Chitturi HT Telugu
Nov 08, 2024 05:43 AM IST

కియా ఇండియా సోనెట్, సెల్టోస్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా కొత్త ఎస్​యూవీని రెడీ చేసింది. దీని పేరు కియా క్లావిస్​. ఈ ఎస్​యూవీ టీజర్​ని తాజాగా విడుదల చేసింది. ఆ వివరాలు..

కియా క్లావిస్​ టీజర్​ రిలీజ్​..
కియా క్లావిస్​ టీజర్​ రిలీజ్​..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై ఫోకస్​ చేసిన కియా మోటార్స్​.. తన లైనప్​లో వివిధ మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కియా క్లావిస్​ పేరుతో ఒక పెద్ద ఎస్​యూవీని సంస్థ త్వరలో లాంచ్​ చేయనుంది. ఈ మోడల్​కి సంబంధించిన టీజర్​ని సంస్థ తాజాగా విడుదల చేసింది. సబ్ కాంపాక్ట్ కియా సోనెట్, కాంపాక్ట్ కియా సెల్టోస్ మధ్యలోకి ఈ కియా క్లావిస్​ చేరుతుంది. ఈ మోడల్​, భారతదేశ ఎస్​యూవీ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటుందని సంస్థ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ చూసేద్దాము..

కియా క్లావిస్​ విశేషాలు..

ఫ్లాగ్​షిప్ ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ, విలాసవంతమైన కార్నివాల్ లిమోసిన్ నుంచి ప్రేరణ పొందింది ఈ కియా క్లావిస్. దీని ఆధునిక డిజైన్​కి ప్రత్యేకతను సంతరించుకుంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా వాహన తయారీదారు డిజైన్ 2.0 ఫిలాసఫీని ప్రదర్శించిన, మొదటి భారతదేశంలో తయారైన ఎస్​యూవీ ఈ కియా క్లావిస్​.

ఇటీవలి స్కెచ్​ల ప్రకారం.. క్లావిస్ ఫ్లాట్ రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, విలక్షణమైన రేర్​ ప్రొఫైల్ కలిగి ఉంది. సైడ్ వ్యూ ముఖ్యంగా ఆర్వి లాంటిది, ఇది కియా కారెన్స్​ని గుర్తుచేసే బాక్సీ- స్టైలిష్ డిజైన్​ని సూచిస్తుంది.

వర్టికల్లీ ఫిట్టెడ్​ ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్, వర్టికల్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన సొగసైన ఎల్​ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లను ఈ కియా క్లావిస్​ ఎస్​యూవీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, బంపర్​కు అనుసంధానించిన బ్రేక్ లైట్లు దాని ప్రత్యేకమైన రేర్​ స్టైలింగ్​ను జోడిస్తాయి. రేర్​ లైట్లు ముఖ్యంగా కియా ఈవీ9ను గుర్తుకు తెస్తాయి. ఇది వాహనానికి ప్రీమియం లుక్​ను పెంచుతుంది. రూఫ్ రైల్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు.

పెద్ద ఆకారంలోని విండోస్​ మరింత తెరిచిన, గాలితో కూడిన క్యాబిన్​కి హామీ ఇస్తాయి. అయితే 4 స్పోక్ అల్లాయ్ వీల్స్​, క్లావిస్ బోల్డ్ లుక్​ని పూర్తి చేస్తాయి.

క్లావిస్ సోనెట్​కు ప్రీమియం ప్రత్యామ్నాయంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ సెల్టోస్ కంటే దిగువన ఉంటుంది. ఈ ఎస్​యూవీ హై-ఎండ్, వాల్యూ ఓరియెంటెడ్ ఫీచర్ల మిశ్రమాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎక్స్​టీరియర్ ఫీచర్లలో ఆల్-రౌండ్ ఎల్ఈడీ లైటింగ్, ఇంటీరియర్ టూ-స్పోక్, ఫ్లాట్-బాటమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ట్విన్-స్క్రీన్ డ్యాష్​బోర్డ్​ సెటప్​ని అందిస్తుంది. ట్విన్ స్క్రీన్ అమరిక అనేది కియా ఇటీవలి మోడళ్లలో ఒక సిగ్నేచర్ ఫీచర్, క్యాబిన్​కు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైబ్​ను జోడిస్తుంది.

360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రిక్ సన్​రూఫ్, ఆటోమేటిక్ వైపర్స్, స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ, హై-క్వాలిటీ ఆడియో సిస్టమ్ వంటి ఇతర ఊహించిన సౌకర్యాలు ఈ కియా క్లావిస్​లో ఉన్నాయి.

క్లావిస్ కోసం పవర్ట్రెయిన్ ఎంపికలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పెట్రోల్- ఎలక్ట్రిక్ వేరియంట్లు రెండూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది! పెట్రోల్ ఇంజిన్ల కోసం క్లావిస్ 118 బీహెచ్​పీ, 172 ఎన్ఎమ్ టార్క్​ను అందించే 1.0-లీటర్ టర్బోఛార్జ్​డ్ యూనిట్​ను అందిస్తుంది, అలాగే సెల్టోస్, సోనెట్ నుంచి 1.5-లీటర్, 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్​ల ఆప్షన్స్​ని అందిస్తుంది.

ఈ మోడల్​ లాంచ్​ డేట్​, ధరతో పాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం